IRCTC: ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు బహుమతుల బొనాంజా.. స్పెషల్ ఆఫర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..

|

Aug 29, 2021 | 12:42 PM

తేజస్ ప్రయాణికులకు  IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. టికెట్ బుక్కింగ్ చేసుకోవల్సిన  చివరి తేదీ సెప్టెంబర్ 6గా ఐఆర్‌టీసీ నిర్ణయించింది.

IRCTC: ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు బహుమతుల బొనాంజా.. స్పెషల్ ఆఫర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..
Irctc Tejas
Follow us on

తేజస్ ప్రయాణికులకు  IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తోంది. వాస్తవానికి  న్యూఢిల్లీ నుంచి లక్నో మధ్య నడుస్తున్న 82501/82502 తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. అయితే అందులో ప్రయాణించే ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకంను తీసుకొచ్చింది. ప్రయాణీకులకు బహుమతులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రయాణికులను ఆకర్శించేందుకు ఇప్పుడు IRCTC కొత్త లక్కీ డ్రా ఆఫర్‌తో తెచ్చింది. లక్కీ డ్రా ద్వారా ఇందులో ప్రయాణించే ప్రయాణీకులకు బహుమతులు ఇస్తుంది. మీరు కూడా ఈ రైలులో ప్రయాణం చేయబోతున్నట్లయితే మీ నంబర్ కూడా  లక్కీ ప్రయాణీకుల లిస్టులో రావచ్చు! అయితే లక్కీ డ్రాను ఎలా గెలుచుకోవాలి… IRCTC ఎలాంటి బంపర్ ఆఫర్ ఇస్తోందో తెలుసుకుందాం…

బహుమతులే బహుమతులు..

లక్నో నుండి న్యూఢిల్లీ వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో 13 మంది లక్కీ ప్యాసింజర్‌లను ఎంపిక చేస్తుంది. అలా గుర్తించనవారికి  ఐఆర్‌సిటిసి బహుమతులను ఇస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రమే బహుమతి లభిస్తుందని కాదు.. చైర్ కారు బుక్ చేసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 27 న, 13 మంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్యాసింజర్లు, 10 మంది చైర్ కార్ ప్యాసింజర్‌లు బహుమతులను అందిస్తారు. న్యూఢిల్లీ నుండి లక్నో వస్తున్న 13 మంది ప్రయాణీకులకు బహుమతులు కూడా ఇవ్వనున్నారు. ఆగస్టు 27 న ఈ రైలు ప్రయాణం ప్రారంభిస్తుంది.

డిసెంబర్ 6 చివరి తేదీ

27 ఆగస్టు నుండి ఈ ఆఫర్ ప్రారంభమైంది. టికెట్ బుక్కింగ్ చేసుకోవల్సిన  చివరి తేదీ సెప్టెంబర్ 6గా ఐఆర్‌టీసీ నిర్ణయించింది. దేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సిటిసి ద్వారా నడపబడుతోంది. కోవిడ్ లాక్‌డౌన్  కారణంగా ఈ రైలు చాలా రోజు నిలిచిపోయింది. ఈ రైలు ఇటీవలే తిరిగి  ప్రారంభించబడింది.

ప్రయాణీకులను ఈ రైలు వైపు ప్రలోభపెట్టడానికి ఐఆర్‌సిటిసి ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఈ క్రమంలో IRCTC లక్నో, న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకాన్ని ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు ప్రారంభించింది.

PNR నంబర్ ఆధారంగా లక్కీ డ్రా?

IRCTC పథకం కింద కంప్యూటర్ ఆధారిత లక్కీ డ్రా జరుగుతోంది. దీనిలో కంప్యూటర్ చైర్ కారులో ప్రయాణిస్తున్న 10 మంది ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న 3 మంది ప్రయాణికుల పేర్లను ఎంచుకుంటుంది. ప్రయాణీకులను వారి PNR ఆధారంగా ఎంపిక చేస్తారు.

లక్నో- న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం ఈ లక్కీ డ్రా పథకం రూపొందించినట్లుగా ఐఆర్‌సిటిసి చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు.  PNR ఆధారంగా విజేతలను ఎంపిక చేయనున్నారని తెలిపారు. దీని తరువాత ఈ అదృష్ట ప్రయాణీకులకు రైలులోనే IRCTC బహుమతి ఇస్తోంది.

ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..