ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ‘భారత గౌరవ్’ రైలు సేవలకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన కాళీ టూర్ 5 ట్రిప్పులకు గాను 100 శాతం ఆక్యుపెన్సీ లభించడం విశేషం. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నార్త్ ఇండియాలోని పలు ప్రసిద్ధ యాత్రా స్థలాలను కవర్ చేసేలా భారత్ గౌరవ్ రైళ్లలో కొత్త టూరిస్ట్ సర్క్యూట్ను ప్లాన్ చేసింది. ఈ టూర్‌లో భాగంగా మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమతుంది.
జూన్ 10వ తేదీన ప్రారంభం కానున్న ఈ టూర్‌లో ఇప్పటికే 50 శాతం కంటే ఎక్కువ సీట్లు బుక్ కావడం విశేషం. ఇక ప్యాకేజీ వివరాల్లోకి వెళితే.. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జూన్ 10వ తేదీన ప్రారంభమవుతుంది. తెలంగాణలోని కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్‌లతో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా , వార్ధా, నాగ్‌పూర్ స్టేషన్స్‌లో ఎక్కేందుకు/దిగేందుకు అవకాశం ఉంది.
కత్రా, ఆగ్రా, మథుర, బృందావన్, హరిద్వార్, రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేస్తుంది. కత్రా స్టేషన్ నుండి వైష్ణో దేవి ఆలయానికి పోనీ / డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం టూర్ 8 రాత్రులు / 9 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు టూర్ ఎస్కార్ట్‌లు, భద్రత, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ప్రయాణ బీమా సౌకర్యం కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్ సందర్శించండి. లేదా సికింద్రాబాద్ ఆఫీసులోని 9701360701, 8287932228, 9110712752 ఈ నెంబర్లను సంప్రదించండి.
ఇక టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళితే.. ఎకానమీ కేటగిరీ (స్లీపర్) రూ. 15,435గా ఉంటుంది. అలాగే 3 సీనీ రూ. 24,735, 2 ఏసీ ధర రూ. 32,480గా ఉంది.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..