Rajasthan Museums: రాజస్థాన్‌లో ఈ 5 ఉత్తమ మ్యూజియంలు..! వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Sep 27, 2021 | 10:05 PM

Rajasthan Museums: రాజస్థాన్‌లో అద్భుత రాజ భవనాలు, ఎత్తైన కోటలు, నిర్మాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

Rajasthan Museums: రాజస్థాన్‌లో ఈ 5 ఉత్తమ మ్యూజియంలు..! వీటి చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Museum
Follow us on

Rajasthan Museums: రాజస్థాన్‌లో అద్భుత రాజ భవనాలు, ఎత్తైన కోటలు, నిర్మాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఒక్కో భవంతి ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది. అంతేకాదు అద్భుత మ్యూజియంలు దర్శనమిస్తాయి. వీటి ద్వారా రాజస్థాన్‌ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. సిటీ ప్యాలెస్ మ్యూజియం, ఉదయపూర్
సిటీ ప్యాలెస్ మ్యూజియాన్ని మహారాజా సవాయ్ మాన్ సింగ్ II మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇది ఉదయపూర్‌లో ఉంటుంది. ఇది కచ్వాహా పాలకుల భారతీయ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. సిటీ ప్యాలెస్ అద్భుతంగా ఉంటుంది. దీని నిర్మాణం, ఇందులో ఉండే ఆభరణాలు, ఆయుధాలు, చిత్రాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

2. ఆహర్ మ్యూజియం, ఉదయపూర్
ఆహర్ మ్యూజియం ఉదయపూర్‌లోని ఒక స్థానిక మ్యూజియం. ఈ మ్యూజియం కళాభిమానులకు ప్రసిద్ధి. చరిత్ర ప్రియులు ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మెసోలిథిక్ యుగం గురించి తెలుపుతుంది. ఇది ఆహర్ స్మారక కట్టడాలకు ప్రసిద్ధి కూడా.

3. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జైపూర్
ఈ మ్యూజియం పేరు లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం నుంచి తీసుకున్నారు. ఇందులో విస్తృత శ్రేణి లోహ వస్తువులు, తివాచీలు, రాతి దంతపు శిల్పాలు, లోహ శిల్పాలు ఉంటాయి. వీటిని ఎప్పుడు చూసి ఉండరు.

4. మహారావ్ మాధో సింగ్ మ్యూజియం, కోటా
ఈ మ్యూజియం రాజస్థాన్‌లోని ప్రతిష్టాత్మక మ్యూజియం. ఈ కోటలో అనేక రకాల పెయింటింగ్‌లు, అల్వార్ రాజ కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తాయి.

5. మాయో కాలేజ్ మ్యూజియం, అజ్మీర్
మాయో కాలేజ్ మ్యూజియం విభిన్న వస్తువులు, కళాఖండాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు, నాణేలు, ఛాయాచిత్రాల సేకరణలకు ప్రసిద్ధి చెందింది. ఇది 18 గదులలో విస్తరించి ఉంటుంది.

Turmeric Powder: పసుపు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ నిరోధిస్తుందా..! ఇందులో ఉన్న రహస్యం ఏంటి..?

Zodiac Signs: ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు ఉన్నవారికి కోపం ఎక్కువ.. వారి గురించి తెలుసుకోండి!

Big News Big Debate LIVE: ఏపీలో వైసీపీ – జనసేన మధ్య మాటలు యుద్ధం.. సన్నాసుల కథా చిత్రమ్‌..