Travel in Monsoon: ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి.. అందమైన అనుభూతినిస్తుంది

|

Jul 05, 2024 | 9:22 AM

మనదేశంలో ఎడారి రాష్ట్రము రాజస్థాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక్కడ ఉన్న చారిత్రాత్మక, పురాతన కట్టలతో పాటు అందమైన ప్రదేశాలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సీజన్ లో యాత్రను ప్లాన్ చేస్తుంటే ఇది సురక్షితమైన ప్రదేశం. వర్షాలు కురిస్తే చాలు.. వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో వేడిగా అనిపించదు. ఇక ఇక్కడ చూడదగిన ప్రదేశాలకు కొరత లేదు. ఈ నేపధ్యంలో ఈ రోజు రాజస్థాన్‌లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Travel in Monsoon: ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి.. అందమైన అనుభూతినిస్తుంది
Tourism
Image Credit source: google
Follow us on

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు అడుగు పెట్టి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. దీంతో ఎండల వేడి నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ సీజన్ ను ఎక్కువగా ప్రకృతి ప్రేమికులు ఇష్టపడతారు. వానలు కురుస్తుంటే దానిని ఎంజాయ్ చేస్తూ పుస్తకం చదువుకోవడాన్ని కొందరు ఇష్టపడితే.. నచ్చిన ఆహరాన్ని వేడి వేడిగా తినడం మరికొందరికి ఇష్టం.. అయితే ఎక్కువ మందికి మాత్రం ఈ సీజన్‌లో ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టపడతారు. కొన్నిసార్లు వర్షం కారణంగా వేసుకున్న ప్రణాళికలు నిలిచిపోతూ ఉంటాయి. అయినప్పటికీ వర్షం కురుస్తుంటే అందమైన సుందర ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటుంటే ఈ రోజు మన దేశంలోని ఒక అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాం.

మనదేశంలో ఎడారి రాష్ట్రము రాజస్థాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక్కడ ఉన్న చారిత్రాత్మక, పురాతన కట్టలతో పాటు అందమైన ప్రదేశాలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సీజన్ లో యాత్రను ప్లాన్ చేస్తుంటే ఇది సురక్షితమైన ప్రదేశం. వర్షాలు కురిస్తే చాలు.. వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో వేడిగా అనిపించదు. ఇక ఇక్కడ చూడదగిన ప్రదేశాలకు కొరత లేదు. ఈ నేపధ్యంలో ఈ రోజు రాజస్థాన్‌లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇక్కడకు ఎవరినా సరే తమ స్నేహితులు, ఫ్యామిలీతో పాటు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయవచ్చు.

మౌంట్ అబూ

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో రాజస్థాన్‌ను సందర్శించాలనుకుంటే మౌంట్ అబూను సందర్శించవచ్చు. ఈ ప్రదేశం ఏడాది పొడవునా పర్యాటకులతో నిండి ఉంటుంది. అయితే ఆహ్లాదకరమైన వర్షాకాలంలో ఈ ప్రదేశం మరింత అందంగా మారుతుంది. ఇక్కడికి రావడం ద్వారా మీరు అందమైన సమయాన్ని గడపవచ్చు. ఇక్కడ సాహస కార్యకలాపాలు కూడా చేయవచ్చు.

కుంభల్‌గర్

వర్షాకాలంలో రాజస్థాన్‌లోని కుంభల్‌గర్ చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న భారీ కోటను చూడడం ఓ మంచి అనుభూతినిస్తుంది. కుంభల్‌గర్‌లోని బాదల్ మహల్, రణక్‌పూర్ జైన దేవాలయం, నీలకంఠ మహాదేవ ఆలయాలను సందర్శించవచ్చు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ కూడా ఇక్కడే ఉంది.

ఉదయపూర్

ఉదయపూర్‌ను సరస్సుల నగరం అని కూడా అంటారు. వర్షాకాలంలో ఈ ప్రదేశం మరింత అందంగా మారుతుంది. ఆరావళి కొండల సుందర దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. మీరు కుటుంబం, స్నేహితులతో మాత్రమే కాదు ఒంటరిగా కూడా ఈ నగరాన్ని సందర్శించవచ్చు. సమయం ఉంటే బయోలాజికల్ పార్క్, సజ్జన్‌గఢ్ ప్యాలెస్‌ని కూడా సందర్శించవచ్చు.

బన్స్వారా

రాజస్థాన్‌లోని బన్స్వారాను సందర్శించకుంటే.. ఇప్పుడే ఇక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ భిన్నమైన వీక్షణను చూసి ఎంజాయ్ చేయవచ్చు. దీనిని 100 దీవుల నగరం అని కూడా అంటారు. ఈ ప్రదేశం ఒంటరి పర్యటనకు సరైనది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి