
ప్రస్తుతం ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. తినే ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం కారణంగా చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. జీవితంలో ఒక్కసారి బీపీ వచ్చిందంటే.. మళ్లీ తగ్గడం చాలా కష్టం. ఉన్నంత కాలం కంట్రోల్ చేసుకోవడమే. హైబీపీ కారణంగా గుండె, మూత్ర పిండాలు, లివర్, మెదుడు వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బీపీని స్లో పాయిజన్ అని వైద్యులు చెబుతూ ఉంటారు. బీపీ వస్తున్నట్టు కూడా శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే ఆహార పదార్థాలతోనే మీరు బీపీనీ అదుపు చేసుకోవాలి.
బీపీ ఉన్నవాళ్లు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. మసాలాలు ఉన్న ఆహారాలు అస్సలు తినడకూడదు. ఇవి తినడం వల్ల బీపీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా గుండెల్లో మంటతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టం.
బీపీ ఉన్నవాళ్లు మీ ఆహారంలో ఆకు కూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. రక్త పోటును అదుపు చేయడంలో ఆకు కూరలు చక్కగా పని చేస్తాయి. ముఖ్యంగా పాలకూర, తోట కూర తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పొటాషియం ఉండే ఆహారాలు తీసుకుంటే.. రక్త పోటును త్వరగా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
టమాటాలు కూడా బీపీని కంట్రోల్ చేయడానికి చక్కగా ఉపయోగ పడతాయి. బీపీ ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం ఒక టమాటా తింటే.. బీపీ అదుపులో ఉంటాయి. టమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త పోటును ఎదుర్కోవడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది.
బీపీ ఉండే వారు మంసాహారానికి బదులు చేపలు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి రక్త పోటును తగ్గించడంలో చక్కగా ఉపయోగ పడతాయి. అంతే కాకుండా ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి. చేపలు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)