లైంగిక, సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ దినుసులు ఓ వరం.. తీసుకుంటే శృంగార సామర్థ్యం కూడా రెట్టింపు..

|

Apr 21, 2023 | 3:39 PM

Fenugreek Seeds: ఈ మధ్యకాలంలో లైంగిక, సంతానలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇందుకు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కొన్ని రకాల

లైంగిక, సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ దినుసులు ఓ వరం.. తీసుకుంటే శృంగార సామర్థ్యం కూడా రెట్టింపు..
Fenugreek Seeds Health Benefits
Follow us on

ఈ మధ్యకాలంలో చాలా మంది లైంగిక, సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక వారు సూచిస్తున్న ఆహార పదార్థాలలో మెంతులు కూడా ఉన్నాయి. మెంతులలోని పోషకాలు పురుషులలోని లైంగిక సామర్థ్యాన్ని పెంచి, వారికి సకాలంలో పిల్లలు పుట్టేలా చేస్తాయట. అలాగే మెంతులలో ఉండే ఫ్యూరోస్టానోలిక్ సపోనిన్ అనే సమ్మేళనం.. పురుషులలో శృంగార కోరికలను కలగజేసే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తయారీలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. అందువల్ల శృంగార, సంతానలేమి సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో కలుపుకోవాలని నిపుణుల సూచన.

అయితే ఈ మెంతులు కేవలం సంతానలేమి, శృంగార సమస్యల నివారణ కోసమే కాక ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగకరమని వారు చెబుతున్నారు. మెంతులలో పుష్కలంగా ఉండే ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, కాపర్, పొటాషియం, జింక్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు, ఇతర ఔషధ గుణాల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇంకా వీటిని తినడం వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు కూడా అందడమే కాక చర్మ, కేశ, గుండె సమస్యలు దూరంగా ఉంటాయి. వీటితో పాటు బరువు తగ్గడంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంకా మెంతులను తినడం వల్ల మనకు కలిగే ఇతర ప్రయోజనాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మెంతి గింజలు తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీరు బరువు తగ్గాలనుకున్నట్లయితే వ్యాయామంతో పాటు వేయించిన మెంతులను కూడా తినండి. నిజానికి మెంతి గింజలలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు బరువు తగ్గించడంలో ఇంకా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే వేయించిన మెంతులు తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

వాపు, కీళ్ల నొప్పి: మెంతులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు శరీర భాగాలపై ఏర్పడిన గాయల మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి.  అనే పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ మంటను తగ్గించడంలో సహాయపడతాయి.కీళ్ల నొప్పులలో మంట మరియు పెద్దప్రేగు శోథ వంటి వ్యాధులలో కూడా మెంతులు ఉపయోగపడతాయి.

బ్రెస్ట్ ఫీడింగ్: మెంతి గింజలు తినడం వల్ల పాలిచ్చే తల్లులలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మెంతులలో ఉండే గెలాక్టగోగ్ సమ్మేళనం బాలింతలకు ఈ విషయంలో ఉపయోగకరంగా ఉంటుంది.

మధుమేహం: మెంతులు రక్తంలోని కార్బోహైడ్రేట్ల శోషణలో సహాయపడటమే కాక ఇన్సులిన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌కు మెంతులు సమర్థవంతమైన నివారణ.

చర్మ సంరక్షన: వేయించిన మెంతులను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలను నిరోధించవచ్చు. ఇంకా మొటిమల నుంచి ఉపశమనం, మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు.

వెంట్రుకలు: మెంతి గింజలు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. మెంతికూర లేదా మెంతులలోని విటమిన్లు, ప్రొటీన్లు జుట్టును ఆరోగ్యంగా, పొడవుగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మెంతి గింజల్లోని ఐరన్ కంటెంట్ తలలోకి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. తద్వారా జుట్టును లోపలి నుంచి బలంగా చేసి, చుండ్రును కూడా తొలగిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..