కడుపు నిండా తిన్నాక స్వీట్స్‌, ఐస్‌ క్రీం లాగించేస్తున్నారా..? అయితే, మీరు డేంజర్‌లో పడినట్టే..

|

Jul 21, 2023 | 6:51 PM

ఆహారం తిన్న వెంటనే జిమ్ లేదా భారీ వ్యాయామం ఎప్పుడూ చేయవద్దు. ఇది వాంతులు, కడుపు నొప్పి , అజీర్తికి కారణమవుతుంది .భోజనం తర్వాత వాకింగ్‌ చేయవచ్చని నిపుణులు చెప్పారు. ఇందులో కనీసం 100 అడుగులు హాయిగా నడవాలి. ఇది ఆహారం జీర్ణం కావడానికి, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి సహాయపడుతుంది.

కడుపు నిండా తిన్నాక స్వీట్స్‌, ఐస్‌ క్రీం లాగించేస్తున్నారా..? అయితే, మీరు డేంజర్‌లో పడినట్టే..
Wrong Eating Habits F
Follow us on

మెరుగైన జీవనశైలి కోసం మంచి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ఇది శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం అనేది వ్యాధుల నివారణ, చికిత్సలో మొదటి అడుగు. మంచి ఆహారంలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మొదలైన వాటి సమతుల్య మిశ్రమం ఉంటుంది. అయితే శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఆహారం తిన్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, కొన్ని పొరపాట్లు మీకు హాని కలిగిస్తాయి. వైద్య పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ చేయకూడని మూడు విషయాలు ఉన్నాయి. అవేంటీ..? ఆహారం తిన్న తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఆహారం తిన్న తర్వాత స్వీట్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది లేకుండా వారి ఆహారం పూర్తి కాదు. కడుపు ఖాళీగా అనిపిస్తుంది. కానీ, ఇలా చేయటం వల్ల కఫం పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, బరువుగా అనిపించటం కలుగుతుంది.

అంతేకాదు.. స్వీట్‌ల మాదిరిగానే ప్రజలు ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడతారు. కానీ రాత్రి భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీమ్ తినడం హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదంలో వేడి ఆహారం తర్వాత చల్లని ఆహారం తినడం మంచిది కాదని, దీనిని ఖచ్చితంగా నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఫిట్‌గా ఉండటానికి జిమ్, వ్యాయామం చాలా ముఖ్యం. ఇది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. కానీ ఆహారం తిన్న వెంటనే జిమ్ లేదా భారీ వ్యాయామం ఎప్పుడూ చేయవద్దు. ఇది వాంతులు, కడుపు నొప్పి , అజీర్తికి కారణమవుతుంది .

భోజనం తర్వాత వాకింగ్‌ చేయవచ్చని నిపుణులు చెప్పారు. ఇందులో కనీసం 100 అడుగులు హాయిగా నడవాలి. ఇది ఆహారం జీర్ణం కావడానికి, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి…