Jaundice Relief Tips: ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

|

Mar 29, 2024 | 3:47 PM

ప్రమాదకరమైన వ్యాధుల్లో కామెర్లు కూడా ఒకటి. కామెర్లలో చాలా రకాలు ఉంటాయి. కామెర్లు వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడంటే వైద్యంలో అనేక మార్పులు వచ్చాయి. కానీ పూర్వం ఈ వ్యాధితో చాలా మంది మరణించేవారు. కామెర్లు వచ్చిన వారికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మనిషి బ్రతుకుతాడు. కామెర్ల వ్యాధి లక్షనలు స్పష్టంగానే కనిపిస్తాయి. కళ్లు పచ్చగా మారిపోవడం, మూత్రం పచ్చగా రావడం, శరీరం పచ్చబడటం వంటి లక్షణాలు..

Jaundice Relief Tips: ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
Foods for Jaundice
Follow us on

ప్రమాదకరమైన వ్యాధుల్లో కామెర్లు కూడా ఒకటి. కామెర్లలో చాలా రకాలు ఉంటాయి. కామెర్లు వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడంటే వైద్యంలో అనేక మార్పులు వచ్చాయి. కానీ పూర్వం ఈ వ్యాధితో చాలా మంది మరణించేవారు. కామెర్లు వచ్చిన వారికి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మనిషి బ్రతుకుతాడు. కామెర్ల వ్యాధి లక్షనలు స్పష్టంగానే కనిపిస్తాయి. కళ్లు పచ్చగా మారిపోవడం, మూత్రం పచ్చగా రావడం, శరీరం పచ్చబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంత భయంకరమైన వ్యాధిని.. ఒక మొక్కతో తగ్గించుకోవచ్చన్ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని గురించి తెలుసు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రక్త హీనత సమస్య ఉన్నవారు ఈ పండు తింటే.. ఆ ప్రాబ్లమ్ నుంచి బయట పడతారు. ఇన్ని పోషకాలున్న దానిమ్మతో కామెర్ల వ్యాధిని తగ్గించుకోవచ్చట. ఆయుర్వేదంలో కూడా దానిమ్మ పండును పలు రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దానిమ్మ పండుతో కామెర్లను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ ఆకు ప్రయోజనాలు..

దానిమ్మ పండు చెట్టు ఆకులతో కామెర్లను తగ్గించుకోవచ్చు. దానిమ్మ చెట్టు ఆకులను కషాయంలా చేసి.. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి బయట పడొచ్చు. కేన్సర్ కణాలను సైతం నయం చేసే గుణం దానిమ్మ ఆకులకు ఉంది. అంతే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి బయట పడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈ కషాయాన్ని తాగితే ఉపశమనం పొందొచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కషాయం తయారీ విధానం:

1. దానిమ్మ ఆకుల్ని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు సగం అయ్యేవరకూ ఉడికించుకోవాలి. ఈ నీటిని రోజుకు ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేయడం వల్ల కామెర్లు తగ్గుతాయి.

2. దానిమ్మ ఆకులతో మరో విధంగా కూడా కషాయం తయారు చేసుకోవచ్చు. దానిమ్మ ఆకుల్ని శుభ్రంగా కడిగి.. ఎండలో ఎండబెట్టాలి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత పొడిలా తయారు చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి.. మరగకాచి తాగాలి. ఇలా తాగినా కామెర్ల వ్యాధి తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..