Wake Up Early In The Morning
Health Tips: చాలా మంది ఉదయం లేవగానే మొబైల్ చూడటం, వాట్సాప్ చాటింగ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లేదా ఇతర వీడియోలు చూస్తుంటారు. అలా చేయడం వల్ల రోజంతా మీ మూడ్ పాడయ్యేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం నిద్రలేవగానే ఫోన్‌లకు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటే ఎంతో మంచిదంటున్నారు. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. చాలా మంది ప్రతి రోజు ఇలా చేయడం వల్ల వారు హుషారుగా ఉండలేకపోతున్నారని, దీని వల్ల మీ మూడంతా చెడిపోయి ఏదో కోల్పోయినట్లుగా ఉంటూ హుషారుగా ఉండలేరని వారు సూచిస్తున్నారు.
- నిద్రలేవగానే ఏం చేయాలి: ప్రతి రోజు నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్ చదవండి. తర్వాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకొని నవ్వండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌మార్నింగ్ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చోని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
- నిద్రలేవగానే నిమ్మకాయ నీళ్లు: రిలాక్సేషన్ కోసం నిద్రలేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోయి శరీరం శుద్ది అవుతుంది.
- పండ్లతో హుషారు: ప్రతి రోజూ ఉదయం పూట పండ్లను తింటే ఎంతో మేలంటున్నారు. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకశక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా పండ్లను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హుషారుగా ఉంచుతాయి.
- త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిది: చాలా మంది ఉదయం చాలా ఆలస్యంగా లేచే అలవాటు ఉంటుంది. ఉదయం త్వరగా లేచే అలవాటు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
- నిద్ర లేచిన తర్వాత వ్యాయమం: నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం మీ అలవాట్లలో లేకపోయినట్లయితే ఆ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవగానే ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..