Loose Motions: వర్షా కాలంలో లూజ్ మోషన్స్ సమస్యా.. ఈ చిట్కాలు మీ కోసమే..

వర్షా కాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. దీంతో సీజనల్ వ్యాధులు మరింత ఎక్కువ అవుతాయి. వర్షా కాలంలో ఎక్కువగా చాలా మంది వాంతులు, విరేచనాలు అవుతూ ఉంటాయి. విరేచనాల్లో లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. లూజ్ మోషన్స్ అంటే నీళ్ల విరేచనాలు. నిల్వ ఉంచి ఆహారం తిన్నా..

Loose Motions: వర్షా కాలంలో లూజ్ మోషన్స్ సమస్యా.. ఈ చిట్కాలు మీ కోసమే..
Loose Motions
Follow us

|

Updated on: Aug 19, 2024 | 4:53 PM

వర్షా కాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. దీంతో సీజనల్ వ్యాధులు మరింత ఎక్కువ అవుతాయి. వర్షా కాలంలో ఎక్కువగా చాలా మంది వాంతులు, విరేచనాలు అవుతూ ఉంటాయి. విరేచనాల్లో లూజ్ మోషన్స్ కూడా అవుతాయి. లూజ్ మోషన్స్ అంటే నీళ్ల విరేచనాలు. నిల్వ ఉంచి ఆహారం తిన్నా.. బయట ఆహార పదార్థాలు తిన్నా.. ఇలా నీళ్ల విరేచనాలు అవుతాయి. ఈ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు.. చాలా మందికి నీరసంగా, కడుపులో నొప్పిగా ఉంటుంది. చాలా మంది కంగారు పడి ఆస్పత్రికి వెళ్తూ ఉంటారు. అయితే ఒకసారి ఈ చిట్కాలు ట్రై చేయండి. వీటిని ట్రై చేస్తే.. ఆస్పత్రికి వెళ్లే పని ఉండదు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ రసం:

నీళ్ల విరేచనాలు ఎక్కువగా అవ్వడం వల్ల బాగా నీరసం అవుతుంది. అలాగే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు పోతాయి. వీటిని తిరిగి పెంచుకోవాలంటే.. నిమ్మకాయ నీళ్లు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. ఒక గ్లాస్ నిమ్మ రసంలో కొద్దిగా పంచదార, ఉప్పు కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చు.

అరటి పండు:

నీళ్ల విరేచనాలు అవుతుంటే అరటి పండు తినడం మంచిది. అరటి పండు తినడం వల్ల శక్తి వస్తుంది. అంతే కాకుండా విరేచనాలు కూడా ఆగుతాయి. అరటి పండు బాగా పండినది కాకుండా.. కాస్త పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. నారింజ, ద్రాక్ష వంటివి తిన్నా నీళ్ల విరేచనాలు ఆగుతాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు తినండి:

మీకు లూజ్ మోషన్స్ అవుతుంటే అడ్డుకట్ట వేయడానికి పెరుగు చక్కగా సహాయ పడుతుంది. పెరుగు అన్నం తిన్నా, మజ్జిగ కానీ తాగినా లేక పెరుగు తిన్నా చాలా మంచిది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పెరుగు తింటే జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను బయటకు పంపి.. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతే కాకుండా విరేచనాలు కూడా తగ్గుతాయి. గంజి నీళ్లు, పెసలు, కిచిడీ వంటివి తిన్నా.. మంచి ఫలితం ఉంటుంది. విరేచనాలు తగ్గేవరకూ కారం, మసాలాలు, నాన్ వెజ్, ఆయిల్ ఉన్న పదార్థాలు తినకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం