ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బెంగాల్‌లో అభయ ఘటన మరవక ముందే తమిళనాడులోని కృష్ణగిరి అనే మరో మృగాడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీసీ క్యాంప్‌ పేరుతో 13 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు శివరామన్‌ అనే ప్రబుద్దుడు.

ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
Tamilnadu
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 19, 2024 | 11:16 PM

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బెంగాల్‌లో అభయ ఘటన మరవక ముందే తమిళనాడులోని కృష్ణగిరి అనే మరో మృగాడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీసీ క్యాంప్‌ పేరుతో 13 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు శివరామన్‌ అనే ప్రబుద్దుడు. విషయం తెలుసుకున్న పోలీసులు శివరామన్‌ను అరెస్ట్ చేశారు.

బెంగాల్‌లో యువ డాక్టర్‌ అత్యాచార ఘటన మరవక ముందే తమిళనాట మరో అమానుషంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శివరామన్‌ అనే వ్యక్తి ఫేక్‌ ఎన్‌సీసీ క్యాంప్‌ పెట్టి 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నామ్‌ తమిళర్‌ కట్చి అనే రాజకీయ పార్టీకి చెందిన శివరామన్‌ కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు వెళ్లాడు. స్కూళ్లో ఎన్‌సీసీ యూనిట్‌ లేనప్పటికీ.. అక్కడ క్యాంప్‌ నిర్వహిస్తామని చెప్పాడు. శివరామన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేసుకోకుండా ఆ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంప్‌ పెట్టేందుకు అంగీకరించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్యాంప్‌నకు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 17 మంది బాలికలు ఉన్నారు.

అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్‌ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. వాళ్లకు తోడుగా టీచర్లు లేకపోవడంతో శివరామన్‌ 8వ తరగతి చదవుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఈవిషయాన్ని బాధితులు స్కూల్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్‌ పరువుపోతుందని భావించిన ప్రిన్సిపల్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శివరామన్‌, స్కూల్‌ ప్రిన్సిపల్‌, టీచర్లు సహా మొత్తం 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. శివరామన్‌ నేరచరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నాయి. విద్యార్ధినులకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..?
ఐశ్వర్య రాయ్ నటించిన ఏకైక తెలుగు సినిమా ఎదో తెలుసా..?