నేటితో ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు, 5 లక్షలకు పైగా యాత్రికులు.. పూర్తి వివరాలు..

లింగాకృతిలో పూజలు అందుకునే పరమ శివుడు హిమాలయాల్లో అనేక చోట్ల కొలువై ఉన్నాడు. అయితే మంచుతో సహజసిద్ధంగా శివలింగం ఏర్పడేది మాత్రం ఒకే ఒక్క చోట. అదే జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో హిమశిఖరాల మధ్య, సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గుహ.

నేటితో ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు, 5 లక్షలకు పైగా యాత్రికులు.. పూర్తి వివరాలు..
Amarnarh Yathra
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 19, 2024 | 5:13 PM

లింగాకృతిలో పూజలు అందుకునే పరమ శివుడు హిమాలయాల్లో అనేక చోట్ల కొలువై ఉన్నాడు. అయితే మంచుతో సహజసిద్ధంగా శివలింగం ఏర్పడేది మాత్రం ఒకే ఒక్క చోట. అదే జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో హిమశిఖరాల మధ్య, సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గుహ. ఏడాది మొత్తంలో కొద్ది రోజుల పాటు మాత్రమే దర్శనిమిచ్చే ఈ శివయ్యను దర్శించుకోవడం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. అయితే ఇంత ఎత్తున, అత్యంత ప్రమాదభరితమైన హిమశిఖరాలు, లోయల మీదుగా అక్కడికి చేరుకోవడం ఓ సాహసమే. అందుకే ఈ యాత్రకు ముందు వైద్యపరీక్షలు చేసి ఫిట్‌నెస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర 52 రోజుల అనంతరం శ్రావణ పూర్ణిమ (సోమవారం) నాడు ముగిసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగే ఈ యాత్రలో ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా యాత్రికులు పాల్గొన్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ప్రతియేటా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే ఈ యాత్రలో ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని తెలిపాయి.

అమర్‌నాథ్ గుహకు చేరుకోడానికి రెండు మార్గాలున్నాయి. ఒక మార్గం పహల్‌గాం వద్ద ప్రారంభమై చందన్‌వాడి, శేష్‌నాగ్, పంచతరణి వంటి అందమైన ప్రదేశాల మీదుగా సాగుతోంది. మొత్తం 46 కి.మీ పొడవైన ఈ మార్గంలో గుహను చేరుకోడానికి రెండ్రోజుల పాటు నడక సాగించాల్సి ఉంటుంది. మరో మార్గం బాల్‌తాల్. ఇది దాదాపు నిటారుగా పర్వతాన్ని అధిరోహించినట్టుగా ఉండే మార్గం. ఈ మార్గంలో ఉదయం బయల్దేరితే సాయంత్రానికి గుహను చేరుకోవచ్చు. యాత్రికులు తమ శక్తిసామర్థ్యాలను, ఆరోగ్యాన్నిబట్టి తమకు నచ్చిన మార్గంలో యాత్ర చేస్తుంటారు. ఇంత ఎత్తుపై ఆక్సీజన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి యాత్రికుల్లో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇబ్బందులు పడుతుంటారు.

ఈసారి అమర్‌నాథ్ యాత్రకు ఇద్దరు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా కేంద్ర ప్రభుత్వం నియమించి యాత్ర మార్గంలో భక్తులకు సదుపాయాలు కల్పించింది. సదుపాయాలతో పాటు యాత్రికుల భద్రత కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులతో పాటు ఆపద సమయంలో ఆదుకునేందుకు NDRF వంటి సహాయ బృందాలను సైతం సిద్ధంగా ఉంచారు. అలాగే యాత్రికులకు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించేందుకు అడుగడుగునా సాయుధ పారామిలటరీ బలగాలు, రక్షణ బలగాలను మొహరించారు. బల్తాల్ రోడ్డుకు నోడల్ అధికారిగా ప్రభుత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి, పహల్గాం రోడ్డుకు నోడల్ అధికారిగా పబ్లిక్ వర్క్స్ శాఖ కార్యదర్శి భూపేంద్ర కుమార్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యాత్ర మార్గంతో పాటు హైవేపై సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ప్రైవేటు సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేశారు.

యాత్ర ముగిసినా.. బలగాలు అక్కడే..

సాధారణ పరిస్థితుల్లో యాత్ర కోసం వినియోగించిన అదనపు బలగాలను యాత్ర ముగిసిన వెంటనే వెనక్కి రప్పిస్తుంటారు. అయితే జమ్ము-కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తేదీలను సైతం ప్రకటించిన నేపథ్యంలో అదనపు బలగాలను ఇప్పుడు ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి వివిధ పారా మిలటరీ బలగాల అధిపతులకు ఆదేశాలు అందాయి. అమర్‌నాథ్ యాత్ర కోసం 500 కంపెనీలకుపైగా సాయుధ బలగాలను వినియోగించారు. వారిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)తో పాటు రక్షణ శాఖకు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ (RR), ఇతర స్పెషల్ కమెండో ఫోర్స్‌ ఉన్నాయి.

జమ్ము-కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న మొదటి విడత, సెప్టెంబర్ 25న 2వ విడత, అక్టోబర్ 1న మూడవ (చివరి) విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అప్పటి వరకు అమర్‌నాథ్ యాత్ర భద్రత కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిన అదనపు బలగాలు అక్కడే కొనసాగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం