Viral Video: మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయారు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు.. వీడియో
ఇటీవల కాలంలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి.. చుట్టూ జనం ఉన్నా.. హద్దులు దాటుతున్నాయి.. చాటు.. మాటు అనిలేకుండా అందరిముందే బరితెగిస్తున్నాయి.. గత కొంతకాలం నుంచి మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రోమాన్స్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..
ఇటీవల కాలంలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి.. చుట్టూ జనం ఉన్నా.. హద్దులు దాటుతున్నాయి.. చాటు.. మాటు అనిలేకుండా అందరిముందే బరితెగిస్తున్నాయి.. గత కొంతకాలం నుంచి మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రోమాన్స్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంటున్న ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఢిల్లీ మెట్రోలో ఓ జంట హద్దులు మీరింది.. అందరూ ఉన్నారన్న సంగతి మరిచిపోయి ముద్దులతో రెచ్చిపోయింది..హగ్ చేసుకొని, ముద్దులు పెట్టుకుంటూ లోకాన్నే మర్చిపోయింది. ఇలా మళ్లీ ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది..
అసలేం జరిగిందంటే.. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రేమ జంట మెట్రోలో ప్రయాణించింది.. వారిద్దరూ సోయలేకుండా ఉన్నారు.. ఈ క్రమంలో ఒకరినొకరు బహిరంగంగా ముద్దులు పట్టుకుంటూ కనిపించారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు సెల్ ఫోన్ లో రికార్డు చేసి.. చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వీడియో చూడండి..
View this post on Instagram
వైరల్ వీడియోలో.. ఒక ప్రేమ జంట మెట్రోలో ఒకరినొకరు కౌగిలించుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వుతూ కనిపిస్తున్నారు. కొంత సమయం తర్వాత వారికి మెట్రోలో సీటు దొరికింది. అప్పుడు ప్రియురాలు.. ప్రేమికుడికి ముద్దు పెడుతూ కనిపిస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ వీడియో ఎప్పటిది..? ఎవ్వరు తీశారు..? ఎక్కడ తీశారనేది క్లారిటీ లేదు.. అయినప్పటికీ.. నెటిజన్లు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
(అయితే.. వైరల్ అవుతున్న ఈ వీడియో ఢిల్లీ మెట్రోకి సంబంధించినదని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.. కానీ, టీవీ9 మాత్రం దీనిని ధృవీకరించడం లేదు..)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..