శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె.. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉండగలం. గుండె ఫెయిల్ అయినా, గుండెలో ఏవైనా సమస్యలు వచ్చినా.. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా కనిపిస్తాయి. కాబట్టి, మన చిన్న హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం పాటించాలి. గుండెకు సంబంధించిన సమస్యలను కొన్ని సంకేతాల ద్వారా పసిగట్టేయవచ్చు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
మెట్లు ఎక్కడం కష్టమైతే..!
మెట్లు ఎక్కేందుకు ఒకటిన్నర నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా దమ్ము, ఆయాసం వంటివి కలిగినా కూడా గుండెకు సంబంధించిన సమస్య ఉందని తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన హృదయం ఉన్న ఏ వ్యక్తి కూడా మెట్లు ఎక్కడానికి ఒకటిన్నర నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు. వారు కనీసం 10 నుండి 15 మెట్లను ఎన్ని అడ్డంకులు ఉన్నా నిమిషంలో సులభంగా ఎక్కగలిగితే వారి గుండె ఆరోగ్యం బాగుంటుందని అంటారు. ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
యువతలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది?
వ్యాయామాలు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా లాంటి లక్షణాలు, గురక, వంటివి కనిపిస్తే, మీకు గుండె సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు, పాదాలు, కాళ్ళు, వెనుక కాళ్ళలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ రకమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. కాబట్టి అకస్మాత్తుగా కాళ్లు ఉబ్బితే వైద్యుల సలహా తీసుకుని గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఇవన్నీ గుండెపోటు లక్షణాలే!
గుండె సమస్యలు ఉన్నప్పుడు కూడా కాళ్లలో వాపు వస్తుంది. కాళ్ల వాపులు కేవలం కాళ్ల సమస్య మాత్రమే అనుకోవడం సరికాదు! కాబట్టి ఈ సమస్య పదే పదే కనిపిస్తే వెంటనే సంబంధిత చికిత్స చేయించుకోవడం మంచిది.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయడం, యోగాభ్యాసం చేయడం, ఉదయం, సాయంత్రం నడవడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా పాటించాలి. బీపీ-షుగర్ రోగులు ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వీటన్నింటితో పాటు, ప్రతి సంవత్సరం గుండె ఆరోగ్య పరీక్షలను చేయించుకోవటం కూడా మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..