Guava Side Effects:ఎంతో ఇష్టంగా తినే పండ్లలో జామ పండు కూడా ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే జామపండును తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం. జామపండులో ఉండే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పలు పోషకాలు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే జామపండుతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. పరిమితికి మించి తీసుకుంటే అమృతం కూడా విషమైన మాదిరిగానే జామపండును కూడా అతిగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం అసలు మంచిది కాదు. జామపండులోని పోషక గుణాలు వారి సమస్యలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. మరి ఏయే సమస్యలతో బాధపడేవారు ఈ జామపండుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు: నిత్యం కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు జామపండ్లకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ఫ్రక్టోజ్, విటమిస్ సి కారణంగా తినగానే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం మరింత ఎక్కువవుతుంది.
జలుబు, దగ్గు: జలుడు, దగ్గుతో బాధపడుతున్న వారు కూడా జామపండ్లకు దూరంగా ఉండాలి. లేకపోతే జలుబు ప్రభావం మరింత ఎక్కువుతుంది. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు జామ పండును తింటే జలుగు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
డయాడెటిక్స్: షుగర్ పేషెంట్స్ జామ పండుకు దూరంగా ఉంటే మంచిది. జామలో సహజంంగా ఉండే చక్కెర వల్ల డయాబెటిక్ పేషెంట్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల పరిమితంగా జామపండును తినాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..