
ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. అందంగా ఉండాలని చాలా మంది మార్కెట్లో ఉండే ప్రోడెక్ట్స్‌ని యూజ్ చేస్తారు. కానీ భవిష్యత్తులో వీటితో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇంట్లోనే నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు కంజీ బాగా పని చేస్తుంది. ఈ డ్రింక్‌ని ఎలా తయారు చేస్తారు? చర్మ ఆరోగ్యానికి మెరుగు పరచడానికి ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. దీన్ని చాలా మంది ఇండియన్ కొంబుచా అని పిలుస్తారు. క్యారెట్, ఆవాలు, మసాలాలతో కలిపి కంజీని తయారు చేస్తారు. కంజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రీఫ్రెష్‌గా ఉంటుంది. కంజీ డ్రింక్ తాగడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు. కంజీని మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కంజీ డ్రింక్‌లో ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రల్ చేయడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కంజీని రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. ఫైన్ లైన్స్, ముడతల రాకుండా చూడటంలో ఇది చక్కగా పని చేస్తుంది.
చాలా మంది ముఖం, చర్మం అందంగా మెరవాలని కోరుకుంటారు. అలాంటి వారు కంజీని తాగవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు సి, ఇ, పొటాషియం.. చర్మ కణాలకు పోషణ అందించి.. హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది. కంజీని తరచుగా క్రమం తప్పకుండా తాగితే.. మంచి స్కిన్ గ్లోయింగ్ చర్మం మీ సొంతం అవుతుంది.
కంజీ డ్రింక్‌ను తాగడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు అనేవి రాకుండా ఉండటమే కాకుండా.. త్వరగా తగ్గిపోతాయి. ఈ డ్రింక్.. గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా జీర్ణ క్రియకు కూడా మద్దతు ఇస్తుంది. మొటిమలు, వాపు వంటి చర్మ సమస్యలకు కారణం అయ్యే టాక్సిన్, వ్యర్థ పదార్థాలను బాడీ నుంచి బయటకు పంపించేస్తుంది.
కంజీని తరచుగా తాగడం వల్ల చర్మం అనేది హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పొడి బారే చర్మం ఉండే వారు ఈ కంజీని తాగితే చర్మానికి మంచి తేమ అంది.. ముఖం నిగారిస్తూ ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.