చాలా మందికి చలికాలం అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడతాయి. చలికాలంలో చాలా మందికి ఎముకల నొప్పి పెరుగుతుంది. అంతే కాదు ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు మన చర్మంతో పాటు జీర్ణవ్యవస్థపైనా ప్రభావం చూపుతాయి. ఈ గాలులు శరీరంలోని రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీని కారణంగా శరీరంలోని అన్ని విధులు ప్రభావితమవుతాయి.
అటువంటి పరిస్థితిలో శీతాకాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి.. మన దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం.. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వేడి నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: చలికాలంలో వేడినీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిజానికి, చల్లని వాతావరణం కారణంగా ఉదయం మన రక్త ప్రసరణ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేచినప్పుడు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వేడి నీటిని త్రాగాలి. ఇది మీ రక్త ప్రసరణను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
వేడి నీరు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది: ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికి మొత్తం తొలగిపోతుంది. వేడి నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండటమే కాదు రక్తం కూడా శుద్ధి అవుతుంది. వేడినీరు తాగడం వల్ల శరీరం మొత్తం మీద ప్రభావం కనిపిస్తుంది.
సోమరితనం లేదా బద్దకాన్ని వదిలించే వేడి నీరు: వింటర్ సీజన్‌లో ప్రతిరోజూ మంచం నుంచి లేవాలంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది. అంతేకాదు నీరసంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఉదయం గోరు వెచ్చని నీరు తాగితే రక్తప్రసరణ సరిగ్గా అయ్యి.. బద్ధకం పోతుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా అనిపిస్తుంది. కనుక ఉదయమే వేడి నీళ్ళు తాగి బద్ధకాన్ని తరిమికొట్టండి.
మెరిసే చర్మం పొందడానికి వేడి నీటిని తాగండి: చల్లని గాలుల వల్ల చర్మం పొడిబారుతుంది. దీన్ని అధిగమించాలంటే రోజూ వేడి నీటిని తాగాలి. వేడి నీరు వెంటనే రక్త ప్రసరణను పెంచుతుంది, దీని కారణంగా శరీరం త్వరగా నిర్విషీకరణ చెందుతుంది. దీంతో చర్మం మెరుస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన పని నీటిని వేడి చేసి గోరు వెచ్చగా తాగడం.
వేడి నీరు సైనస్ నుంచి ఉపశమనం: చలి కాలంలో సైనస్ సమస్య గణనీయంగా పెరుగుతుంది. నిజానికి చలికాలంలో ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి సమస్య తో బాధపడేవారు ఎక్కువ మండే ఉంటారు. అంతేకాదు ఇవి ఎక్కువ రోజులు ఇబ్బంది పెడతాయి కూడా.. ఈ సమస్యను వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని త్రాగాలి, ఎందుకంటే వేడి నీరు సైనసైటిస్ లక్షణాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాదు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)