ఇటీవల కాలంలో చాలా వెయిట్ లాస్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యాయామాలు చేయడం, ఆహారం తగ్గించు తీసుకోవడం వంటివి చేస్తూంటారు. బరువు తగ్గే క్రమంలోనే ఏం తిన్నాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. బరువు పెరుగుతారని పండ్లకు కూడా దూరంగా ఉంటారు. కానీ పండ్లు తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. దీంతో ఎలాంటి లోపాలు, సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కొన్ని రకాల ఫ్రూట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. మరి ఆ ఫ్రూట్స్ ఏంటో ఓ లుక్ వేసేయండి..
ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే వైద్యులకు దూరంగా ఉండొచ్చు. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు యాపిల్‌లో మనకు లభ్యమవుతాయి. అదే విధంగా ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి తిన్నా కడుపు నిండిన భావన కలిగి.. ఆకలి తగ్గుతుంది. అంతే కాకుండా యాపిల్స్ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.
జామకాయలో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అదే విధంగా ఐరన్, విటమిన్ సి కూడా మెండుగా లభ్యమవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు జామకాయను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అదే విధంగా జీర్ణ క్రియను మెరుగు పరచడానికి కూడా, బరువును తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది.
దానిమ్మ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో కేలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో దానిమ్మ తింటే ఈజీగా, ఆరోగ్యవంతంగా బరువు తగ్గొచ్చు. అంతే కాకుండా రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది.
కివీలను పచ్చిగా లేదా ఎండబెట్టి అయినా తినొచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. కివీ తినడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.