Bitter Gourd: కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే.. పొరపాటున కూడా ఈ ఆహారపదార్ధాలతో కలిపి పొరపాటున కూడా తినొద్దు ఎందుకంటే..

కూరగాయల్లో కాకరకాయ వెరీ వెరీ స్పెషల్. ఇవి రుచిలో చేదుగా ఉంటాయి. అయితే కాకర కాయలు ఆరోగ్యానికి ఒక వరం వంటివి. వేసవి కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కాకరకాయ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓ వరం. రెగ్యులర్ గా కాకరని తినడం వలన కళ్ళు, చర్మం, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కాకరకాయని కొన్ని రకాల పదార్ధాలతో కలిపి పొరపాటున కూడా తినొద్దు. ఆరోగ్యానికి హానికరం.

Bitter Gourd: కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే.. పొరపాటున కూడా ఈ ఆహారపదార్ధాలతో కలిపి పొరపాటున కూడా తినొద్దు ఎందుకంటే..
Bittergourd

Updated on: May 04, 2025 | 5:04 PM

కాకరకాయను వేసవి సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. అయితే దీనిలో పోషకాలు అనేకం ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, జింక్, పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మధుమేహ రోగులకు కాకరకాయ ఒక ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడటం సహా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. కాకరకాయ రసం తాగడం వల్ల చర్మం మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తుంది. ఈ రోజు కాకరకాయను కొన్ని రకాల వస్తువులతో తినొద్దు. ఆరోగ్యానికి హానికరం.

కాకరకాయ తినడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. మీరు దీన్ని అనేక విధాలుగా తినే ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాకరకాయను సరైన రీతిలో తింటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తినే సమయంలో పొరపాటు జరిగితే శరీరానికి హానికరం కూడా.

ఈ 4 ఆహారపదార్థాలను కాకరకాయతో తినవద్దు

పాలతో కాకరకాయ తినకండి
పాలలో కాల్షియం, అనేక విటమిన్లు ఉన్నప్పటికీ, కాకరకాయతో కలిపి తినడం హానికరం. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి కూడా చదవండి

మామిడికాయతో కాకరకాయ
మామిడి పండ్లలో రాజు.. మామిడి పండ్లు తినడానికి వేసవి కోసం వేచి ఉంటారు.. అయితే మామిడి పండుని కాకరకాయతో కలిపి తింటే అది ఆమ్లత్వం, మంటను కలిగిస్తుంది. మామిడికాయతో కాకరకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది.

కాకరకాయతో పెరుగు
పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవి కాలంలో ప్రజలు పెరుగు తినడానికి ఇష్టపడతారు.. అయితే కాకరకాయతో కలిపి పెరుగుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా. కాకరకాయను పెరుగుతో కలిపి తినడం వల్ల దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలు వస్తాయి. ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది.

ముల్లంగి కాకరకాయ
ముల్లంగితో కాకరకాయ తినడం హానికరం. ఈ రెండింటి విభిన్న ప్రభావాల కారణంగా ఆమ్లత్వం, గొంతులో దగ్గు వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా సంభవించవచ్చు. మీకు ఇప్పటికే జలుబు, దగ్గు ఉంటే, కాకరకాయ తిన్న తర్వాత ముల్లంగి తినకూడదు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)