గుడ్లు పోషకాహార ఫుడ్. ప్రతి రోజూ ఉడికించిన ఒక కోడి గుడ్డు తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. గుడ్డులో ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. గుడ్డుతో ఒక్కటేంటి.. చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అయితే గుడ్డుతో కలిపి కొన్ని రకాల ఆహారాలు అస్సలు కలిపి తీసుకోకూడదట. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసంతో కలిపి గుడ్డు తినకూడదు. చాలా మంది చికెన్, ఫిష్, మటన్‌తో కలిపి గుడ్డు కూడా తింటూ ఉంటారు. బిర్యానీ వంటి వాటితో కూడా గుడ్డు తింటారు. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.
అరటి పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు, గుడ్డు కలిపి తింటారు. ఈ రెండూ తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటి తిన్న మరో గంటకు తినవచ్చు కానీ.. రెండూ ఒకేసారి కలిపి తీసుకోకూడదు. అరటి పండు, గుడ్డుతో కలిపి పాన్ కేక్స్ వంటివి చేస్తారు. అలా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
ప్రతి రోజూ ఉదయం టీ తాగుతూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డ తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అసిడిటీ, కడుపులో నొప్పి సమస్యలకు దారి తీస్తుంది.
అదే విధంగా చక్కెర – గుడ్డు కాంబినేషన్ వల్ల సమస్యలు రావచ్చు. ఈ రెండూ కలిపి కూడా తీసుకోకూడదు. గుడ్డు కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు, చక్కెర కలిపి తీసుకోకూడదు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..