Healthy eyes : మీ కండ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే..! పదికాలాల పాటు చక్కగా చూడాలంటే ఈ ఆహారం మీ డైట్‌లో ఉండాల్సిందే..?

|

Jun 14, 2021 | 6:41 AM

Healthy eyes : మీ కండ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చూపులేకుంటే ఎన్ని కష్టాలు అనుభవించాలో అంధులను చూస్తే మనకు

Healthy eyes :  మీ కండ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే..! పదికాలాల పాటు చక్కగా చూడాలంటే ఈ ఆహారం మీ డైట్‌లో ఉండాల్సిందే..?
Healthy Eyes
Follow us on

Healthy eyes : మీ కండ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చూపులేకుంటే ఎన్ని కష్టాలు అనుభవించాలో అంధులను చూస్తే మనకు అర్థమవుతుంది. కండ్లు చాలా సున్నితమైన అవయవాలు. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా వచ్చాక డిజిటల్‌ క్లాసులు, వర్చువల్‌ మీటింగ్స్‌ కారణంగా కండ్లపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మందికి కండ్లు పొడిగా అవుతూ, మంటలు పెడుతున్నాయి. సరైన ఆహారం తింటేనే కండ్లకు మేలు జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. విటమిన్‌ ఏ కండ్లకు మేలు చేసే పోషకం. ఈ యాంటీఆక్సిడెంట్‌ కంటి చూపును నిలబెడుతుంది. కంటిలోని కార్నియాను కాపాడుతుంది. కంటి బయటి పొరను రక్షిస్తుంది. రెటీనా బాగా పనిచేసేలా చేస్తుంది. ఏ కలర్‌ ఏదో గుర్తించడానికి సహకరిస్తుంది. అందువల్ల ఈ విటమిన్‌ ఉండే క్యారెట్‌, బత్తాయి, బొప్పాయి, గుడ్లు, మామిడి, ఆప్రికాట్స్‌, వెన్న, బ్రకోలి, చేపలు, ఆవకాడో, దుంపలు మీ డైట్‌లో ఉండేలా చేసుకోండి.

2. కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే జీక్సాన్‌థిన్‌ అత్యవసరం. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటిపై కాంతి పడేటప్పడు ఎక్కువ, తక్కువ కాకుండా చూస్తుంది. ముఖ్యంగా టీవీలు, లైట్లు, మొబైల్‌ ఫోన్లలో ఉండే బ్లూ లైట్‌ వల్ల కంటికి హాని జరగకుండా చేస్తుంది. దీని కోసం గుడ్లు, బచ్చలి, మొక్కజొన్న, బఠాణీలు, చిక్కుడుకాయలు, బ్రకోలి తినాలి.

3. కంటి రెటీనా బాగా పనిచెయ్యాలంటే జింక్‌ తప్పనిసరి. కంటి వెనక కణజాల పొరను ఇది కాపాడుతుంది. లివర్‌ నుంచి విటమిన్‌ ఏ ని కంటికి చేర్చడంలో జింక్‌ బాగా పనిచేస్తుంది. రే చీకటి రాకుండా ఉండాలంటే జింక్‌ తప్పనిసరి. జింక్‌ కోసం ధాన్యాలు, గింజలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పండ్లు, కూరగాయలు, బచ్చలి, బద్దలు, పుట్టగొడుగులు, మాంసం తినాలి.

4. ల్యూటెయిన్‌ మరోరకమైన పోషకం. ఇది కండ్లలోని కలర్స్‌ని గుర్తించే రెండు కెరోటెనాయిడ్స్‌లో ఉంటుంది. సూర్యుడి ఎండ నుంచి కండ్ల కణజాలాన్ని కాపాడటంలో ల్యూటెయిన్‌ బాగా పనిచేస్తుంది. ఈ పోషకం కోసం ఆకుకూరలైన బ్రకోలి, తోటకూర, బచ్చలి వంటివి తినాలి. కూరగాయల్లో బఠాణీలు, మొక్కజొన్న వంటివి తినాలి. పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవాలి.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్ సింగిల్స్‌ టైటిల్‌ జకోవిచ్‌ కైవసం.. 19వ గ్రాండ్​స్లామ్​ను ముద్దాడిన సెర్బియా స్టార్

Silver Price Today: పెరిగిన వెండి ధర.. హైదరాబాద్‌లో నిలకడగా.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల ధరపై ఎంత తగ్గిందో ఆశ్యర్యపోతారు..!