బాబోయ్ వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు…తిన్నారంటే అంతే సంగతులు..!!

సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌ ఉంటుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరగడంతోపాటు ఆరోగ్యం అందుతుంది. ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయి అందరికీ సరిపడదని మీకు తెలుసా..? అవును కొందరు బొప్పాయి జోలికి అస్సలు వెళ్లకూడదని అంటున్నారు. ఎవరూ బొప్పాయి తినకూడదో ఇక్కడ చూద్దాం..

బాబోయ్ వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...తిన్నారంటే అంతే సంగతులు..!!
Papaya

Updated on: Dec 17, 2025 | 9:50 PM

బొప్పాయిలో పపైన్ ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల గర్భధారణ సమయంలో గర్భాశయంలో సంకోచాలు ప్రారంభమవుతాయి. ఇవి సమయానికి ముందే ప్రసవానికి కారణమవుతాయి. కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి కడ్నీల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే కిడ్నీల్లో రాళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బొప్పాయి అవాయిడ్ చేయడం మంచిది. బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

బొప్పాయి షుగర్ రోగులకు ఎంతో ఉపయోగకరం. అయితే చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు వైద్యుడి సలహాతో బొప్పాయిని తినాలి ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అలర్జీ ఉన్న వ్యక్తులు బొప్పాయి తింటే దురద, తుమ్ములు, శ్వాస సమస్యలు ఎదుర్కొనవచ్చు. థైరాయిడ్ సమస్యలున్న వారు ఉన్న కూడా బొప్పాయి తినకపోవడమే బెస్ట్ ఆప్షన్. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు బొప్పాయి ఎక్కువగా తినడం హానికరం కావచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..