Glowing Skin: మెరిసే చర్మం మీ సొంతం కావాలా.? ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌ని ట్రై చేయండి..

చర్మ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. స్కిన్‌ ప్రొటక్షన్‌ కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో..

Glowing Skin: మెరిసే చర్మం మీ సొంతం కావాలా.? ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌ని ట్రై చేయండి..
Glowing Skin

Updated on: Dec 19, 2022 | 6:35 AM

చర్మ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. స్కిన్‌ ప్రొటక్షన్‌ కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో చర్మానికి మెరుగు ఇవ్వొచ్చని మీకు తెలుసా.? కొన్ని రకాల డిటాక్స్‌ డ్రింక్స్‌తో చర్మం మెరిసిపోతుంది. ఇంట్లో సహజంగా లభించే ఈ పానీయాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందకీ ఆ డ్రింక్స్‌ ఏంటంటే..

* అత్యంత సహజమైన డిటాక్స్‌ డ్రింక్స్‌లో కొబ్బరి నీరు ప్రధానమైంది. కొబ్బరి నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. తద్వారా చర్మం ఆరోగ్యం మెరగువుతుంది. క్రమం తప్పకుండా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ముడతలు తగ్గడమే కాకుండా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

* పసుపు కలిపిన పాలను తీసుకోవడం వల్లే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పసుపు యాంటి బ్యాక్టిరీయా లక్షణాలు, పాలలోని ప్రోటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

* మనల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నిమ్మకాయ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ.. అనేక బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకతో పోరాడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా మార్చేస్తుంది.

* సహజసిద్ధమైన డిటాక్స్‌ పానీయాల్లో గ్రీన్‌ టీ ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..