Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: స్నానం చేసిన తర్వాత ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి.. మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి చేయాలి..

మనిషి ప్రతి రోజూ తప్పనిసరిగా చేసే పనులలో స్నానం ఒకటి. అయితే అందరూ స్నానం చేస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత తరచూ కొందరూ కొన్ని తప్పులను చేస్తారు. అవి శరీర ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే స్నానం చేసిన తర్వాత తరచూ చేసే తప్పులేంటో మొదట తెలుసుకోవాలి. వాటిని నివారించడానికి ప్రయత్నించాలి.

Skin Care: స్నానం చేసిన తర్వాత ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి.. మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి చేయాలి..
Bathing
Follow us
Madhu

|

Updated on: Apr 28, 2023 | 10:12 AM

మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో అవయవాల పాత్ర కీలకం. అన్ని అవయవాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే సంపూర్ణ ఆరోగ్యం. అలాగే ఆ అవయవాలను సక్రమంగా పనిచేసేలా చూసుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంటుంది. ప్రతి అవయవాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకే వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం. ఇదే క్రమంలో పై శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిని ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి. లేకుంటే శరీరం నుంచి దుర్వాసన రావడం సహజంగానే జరుగుతుంది. అందుకే రోజూ స్నానం తప్పనిసరి.

మనిషి ప్రతి రోజూ తప్పనిసరిగా చేసే పనులలో స్నానం ఒకటి. అయితే అందరూ స్నానం చేస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత తరచూ కొందరూ కొన్ని తప్పులను చేస్తారు. అవి శరీర ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే స్నానం చేసిన తర్వాత తరచూ చేసే తప్పులేంటో మొదట తెలుసుకోవాలి. వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీపై దీనికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ స్నానం చేసే ఐదు తప్పులను ఆయన లిస్ట్‌ చేశారు. వాటిని మానుకోవాలని సూచించారు. అవేంటో ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి

స్నానం చేసిన తర్వాత ఇవి చేయకూడదు..

  • స్నానం పూర్తయిన తర్వాత టవల్‌ బలంగా రుద్దడం మానుకోవాలి. ఇది మీ చర్మానికి హాని చేస్తుంది. అలా కాకుండా టవల్‌ తో సున్నితంగా మర్దన చేసినట్లు తుడుచుకోవాలి.
  • స్నానం పూర్తయిన తర్వాత చాలా మంది కాస్మొటిక్స్‌ శరీరానికి అప్లై చేస్తారు. వాటిల్లో రసాయనాలతో కూడిన వాటిని పూర్తిగా పక్కనపెట్టడం మంచిది. ఇవి దీర్ఘకాలంలో శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. అవకాశం ఉన్నంత వరకూ సేంద్రియ ఉత్పత్తులను వినియోగించడానికి ప్రయత్నించాలి.
  • కొంతమంది మహిళలు తల స్నానం చేశాక, అది త్వరగా ఆరడానికి టవల్‌ కట్టిగా కొరడా ఝుళిపించినట్లు కొడతారు. దీనివల్ల వెంట్రుకల చివర్లు దెబ్బతింటాయి. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు.
  • అలాగే తడి జుట్టును టవల్‌ గట్టిగా చుట్టడం కూడా చేయకూడదు. దానికి ‍ప్రతిగా టవల్‌తో సున్నతంగా జుట్టుని మసాజ్‌ చేయాలి. అవకాశం ఉన్నంత వరకూ జుట్టును సహజంగా ఆరనివ్వాలి.
  • కొంత మంది స్నానం చేసిన వెంటనే తడి జుట్టునే దువ్వెనతో దువ్వుతారు. అయితే ఇది సరికాదు. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వెన పెట్టాలి.

ఇవేకాక రోజూ స్నానం చేయకపోవడం, అధిక రసాయనాలు కలిగిన సబ్బులను వాడటం, మరి వేడి అధికంగా ఉన్న నీటితో స్నానం చేయడం, తలస్నానం తరచూ చేయకపోవడం వంటివి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వీలైనంత వరకూ వీటికి మార్చుకుంటే మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..