AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదే కాదండోయ్..భారతదేశంలోని ఫేమస్ బిర్యానీ ప్లేసెస్ ఇవే

బిర్యానీ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది హైదరాబాద్. ఇక్కడి బిర్యానీ చాలా ఫేమస్. చాలా మంది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటారు. భాగ్యనగరానికి వచ్చిన వారు ఎవ్వరైనా సరే బిర్యానీ తినకుండా వెళ్లరు.అయితే హైదరాబాదే కాదండోయ్.. భారత దేశంలోని ఈ ప్లేసెస్‌లో కూడా బిర్యానీ చాలా ఫేమస్ అంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 30, 2025 | 8:11 PM

Share
లక్నో బిర్యానీ : నవాబుల వంటశాల నుంచి వచ్చేచాలా రుచికరమైన బిర్యానీ లక్నోబిర్యానీ, దీనిని అవధి బిర్యానీ అని కూడా పిలుస్తారంట.సుగంధ ద్రవ్యాలు సోంపు, దాల్చిన చెక్క మరియు కుంకుమ పువ్వుతో చేసే ఈ బిర్యానీ చాలా ఫేమస్ అంట.

1 / 5
కోల్ కతా బిర్యానీ : పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ఈ బిర్యానీకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుందంట.కోల్‌కతా బిర్యానీ రెసిపీలో బంగాళాదుంపలు, గుడ్లతో పాటు సుంగధ ద్రవ్యాలు ఉంటాయంట. ఇది ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మర్చిపోలేరంటున్నారు ఈ బిర్యానీ ప్రియులు.

2 / 5
కేరళ రాష్ట్రంలోని తలసేరి బిర్యానీ కూడా చాలా అద్భుతమైన రుచిని ఇస్తుందంట. కేరళలోని మలబార్ ప్రాతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ సువాసనగల బాస్మతి రైస్, బంగాలదుంపలు, కైమాతో తయారు చేస్తారంట. ఇది డిన్నర్, లంచ్‌కు చాలా బాగుంటుందంట.

3 / 5
భట్కులి బిర్యానీ ఇది కర్ణాటకప్రాతంలో చాలా బాగా ప్రాచుర్యం పొందినది. ఈ బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుందంట. ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, మాంసంతో తయారు చేస్తారంట. చాలా స్పైసీగా ఉండే ఈ బిర్యానీ తింటే ఆ రుచే వేరుంటుంది.

4 / 5
భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీనే. ఇది నిజాంల వంటశాలల్లో ఉద్భవించింది అంటారు. బాస్మతి రైస్, సుగంధ ద్రవ్యాలు, మాంసంతో, కుంకుమ పువ్వుతో చేసే ఈ బిర్యానీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

5 / 5