Lifestyle: రాత్రుళ్లు అధిక మూత్ర విసర్జన.. షుగర్‌ లక్షణం మాత్రమే కాదు..

వీటిలో ప్రధానమైనవి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం లాంటివి కొన్ని ఉన్నాయి. ఇదిలా ఉంటే అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు మొదలు మరెన్నో ఇతర సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీపీని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే బీపీ నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతుంటారు...

Lifestyle: రాత్రుళ్లు అధిక మూత్ర విసర్జన.. షుగర్‌ లక్షణం మాత్రమే కాదు..
Lifestyle News

Updated on: Jun 02, 2024 | 8:27 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది బీపీ బారినపడుతున్నారు. ఒకప్పుడు ఎక్కువ వయసున్న వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేంది. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండనివారిలో బీపీ సమస్య కనిపిస్తోంది. అధిక రక్తపోటుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

వీటిలో ప్రధానమైనవి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం లాంటివి కొన్ని ఉన్నాయి. ఇదిలా ఉంటే అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు మొదలు మరెన్నో ఇతర సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీపీని ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే బీపీ నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతుంటారు. శరీరంలో బీపీ పెరిగే ముందు శరీరం కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా అలర్ట్‌ చేస్తుంది. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా రోజంతా పనిచేస్తే ఆలసిపోవడం సర్వ సాధారణం. అయితే ఎలాంటి శారీరక శ్రమలేకపోయినా, సరిపడ విశ్రాంతి తీసుకున్నా నిత్యం అలసటగా ఉంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అధిక రక్తపోటుకు ముందస్తు లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇక రాత్రుళ్లు మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తే అది షుగర్‌కు ముందస్తు లక్షణంగా భావిస్తుంటాం. ఇది మనందరికీ తెలిసిందే. అయితే బీపీ కారణంగా కూడా మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అధికరక్తపోటు కారనంగా రాత్రుళ్లు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ లక్షణం కనిపిస్తే షుగర్ టెస్ట్‌తో పాటు, బీపీ టెస్ట్‌ కూడా చేయుంచుకోవాలని నిపుణులు అంటున్నారు.

* బీపీ అధికంగా ఉంటే.. పాదాలు, కాళ్లలో వాపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే కాళ్లలో వాపు గమనిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో వాపు రక్తపోటు ముందస్తు లక్షణంగా చెబుతున్నారు.

* ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే అది అధిక రక్తపోటు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. బీపీ పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..