Life Partner : కొత్తగా వివాహం జరిగిన తర్వాత భార్యా, భర్తల మధ్యం కొంతకాలం సంబంధం బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచిన కొద్ది మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీనికి కారణం ఏంటంటే లైఫ్ పార్ట్‌నర్ నుంచి అంచనాలు పెరగడమే. అపార్థాలు జరగడం, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల గొడవలు పెద్దవి అవుతాయి. భార్యా భర్తల సంబంధం కొనసాగించాలంటే అది ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. వారు కావాలంటే కలిసి ఉండవచ్చు.. లేదంటే విడిపోవచ్చు. అయితే లైఫ్ పార్ట్‌నర్‌తో ఎప్పుడు గుడ్ రిలేషన్ షిప్ ఉండాలంటే కచ్చితంగా ఈ 6 పద్దతులు పాటించాలి.
1. దంపతులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతి ఎల్లప్పుడూ మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు ప్రేమతో, మర్యాదతో ఉండాలి.
2. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకరు కించపరిచే విధంగా మాట్లాడుకోకూడదు. పనులలో కూడా సాయం చేసుకోవాలి. వ్యాపారం, ఉద్యోగం విషయంలో కూడా ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది.
3. భార్యాభర్తల సంబంధంలో కచ్చితంగా గొడవలు ఉంటాయి. కానీ వాటికంటే మీ బంధం గొప్పదని మీరు తెలుసుకోవాలి. అప్పుడే అవన్ని మీకు చిన్నవిగా కనిపిస్తాయి. ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడకూడదు.
4. దంపతులు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పనిచేయకూడదు. ఏ విషయమైనా చెప్పి చేయడం శ్రేయస్కరం. అప్పుడే మనస్పర్థలు రావు. ఇద్దరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అప్పుడు మీ బంధం బలపడుతుంది.
5. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరుచుకోవాలి. ఇది మీకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మీ భాగస్వామి మీ ప్రేమను తనంతట తానుగా అర్థం చేసుకుంటారని ఆశించవద్దు. కావాలంటే అప్పుడప్పుడు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ పదాలను వాడండి.
6. మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే ఖచ్చితంగా మీ భాగస్వామితో చర్చించి సలహాలను అడగండి. దీంతో వారు చాలా పాయింట్లను క్లియర్ చేస్తారు. మీ పార్ట్‌నర్‌కి గుర్తింపు కూడా ఇచ్చినట్లవుతుంది.