WORLD NO TOBACCO DAY-2021 : మూడు అంగుళాల సిగరెట్ మీ ప్రాణాలను హరిస్తుంది..! కరోనా వస్తే వెంటిలేటర్ కచ్చితం..?

|

May 31, 2021 | 2:57 PM

WORLD NO TOBACCO DAY-2021 : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న

WORLD NO TOBACCO DAY-2021 : మూడు అంగుళాల సిగరెట్ మీ ప్రాణాలను హరిస్తుంది..! కరోనా వస్తే వెంటిలేటర్ కచ్చితం..?
Smoking 1
Follow us on

WORLD NO TOBACCO DAY-2021 : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇందులో సిగరెట్ తాగేవారు, పొగాకు బాధితులు ఎక్కువగానే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పొగాకు తీసుకునేవారిలో 50 శాతం ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. పొగాకు విండ్ పైప్‌లో, ఊపిరితిత్తులలో వైరస్‌కి సంబంధించిన ACE2 గ్రాహకాల సంఖ్యను పెంచుతుంది. దీంతో కరోనా సంక్రమణ అధికమవుతుంది. ధూమపానం చేసేవారు కరోనావైరస్ బారిన పడితే వెంటిలేటర్ కచ్చితంగా అవసరం. అంతేకాదు మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ధూమపానం చేసేవారికి కరోనా ఇన్‌ఫెక్షన్‌తో పాటు ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. ధూమపానం చేసేవారు కరోనాకు గురయ్యే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎందుకంటే వారు తరచుగా పెదవుల దగ్గరకు తమ చేతులను తీసుకువస్తారు. పొగాకు తినేవారిలో, హుక్కా తాగే వారిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుట్ఖా-పొగాకు తినడం ద్వారా అధిక లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది ఉమ్మివేస్తే సంక్రమణ వేగంగా వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతుంది. గుట్కా – పొగాకు శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది మాత్రమే కాదు వారికి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు మొదలవుతాయి. తరువాత ప్రమాదకరమైన ఫలితాలు కనిపిస్తాయి. భారతదేశంలో 27 మిలియన్ల మంది పొగాకును ఉపయోగిస్తున్నారు. పొగాకు ఎక్కువగా ఉపయోగించే దేశాలలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో పొగాకు ధూమపానంతో 9.30 లక్షల మంది మరణిస్తున్నారు. కాగా ప్రతి సంవత్సరం పొగాకు తినడం ద్వారా 3.50 లక్షల మంది చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 3500 మందికి పైగా పొగాకు తినడం వల్ల మరణిస్తున్నారు.

సిగరెట్ తాగడం, పొగాకు తినడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధి, మంట, శ్లేష్మం, టిబి వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. పొగాకు పొగలో 4,000 రసాయనాలు ఉంటాయి. ఇది 36 రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా ఇప్పుడే పొగాకు మానేసి మీ ప్రాణాలు కాపాడుకోండి.

Xavier Doherty: ఆర్ధిక ఇబ్బందులతో.. కార్పెంటర్‌గా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌.. వీడియో

Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు

Vijay Thalapathy: తెలుగులో విజయ్ సినిమా కన్ఫర్మ్.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.. షూటింగ్ ఎప్పుడంటే..