Jaggery: రోజుకో చిన్నముక్క చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

|

Dec 31, 2024 | 7:18 PM

బెల్లం ముక్కను నల్ల నువ్వులతో కలిపి తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పితో బాధపడేవారు బెల్లం తినడం అలవాటు చేసుకోండి. నెయ్యితో కలిపి బెల్లం తింటే చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. బెల్లం తీసుకుంటే జ్ఞాపకశక్తి  కూడాపెరుగుతుంది.

Jaggery: రోజుకో చిన్నముక్క చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
Jaggery
Follow us on

బెల్లం తీపిగా ఉండటమే కాదు..ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకుంటే అనేక ప్రయోజనాలు అందించే దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని పోషకాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే భోజనం తర్వాత బెల్లం ముక్క తినడం మంచిది. పాలలో బెల్లం వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. బెల్లంలోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తంలో మలినాలు తొలగిపోయి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రక్తహీనత కూడా తగ్గుతుంది.

తరచూ అలసటతో బాధపడేవారు బెల్లం ముక్క తినడం మంచిది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. పని ఉత్పాదకత పెరగాలంటే ఉదయం బెల్లం తినడం మంచిది. బెల్లానికి శరీరానికి వెచ్చదనం అందించే గుణం ఉంటుంది. తద్వారా చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు నివారించడంలో బెల్లం సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడంలో బెల్లం సహాయపడుతుంది. బెల్లం ముక్కతో అల్లం కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయని చెబుతారు. బెల్లంలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి కొత్త నిగారింపు ఇస్తాయి. స్కిన్ గ్లో పెంచుతాయి. స్కి్న టోన్ మెరుగుపరుస్తాయి. మొటిమలు కూడా తగ్గుతాయి.

ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు బెల్లం తినడం మంచిది. బెల్లం ముక్కను నల్ల నువ్వులతో కలిపి తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పితో బాధపడేవారు బెల్లం తినడం అలవాటు చేసుకోండి. నెయ్యితో కలిపి బెల్లం తింటే చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. బెల్లం తీసుకుంటే జ్ఞాపకశక్తి  కూడాపెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..