Shoes in Summer: మీరు ప్యాషన్ ప్రియులా.. వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త సుమా..

వేసవి కాలం వచ్చేసింది. ఈ సమయంలో ఎండ, వేడి, తేమ కారణంగా చెమటలు పట్టడం సర్వసాధారణం. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారం, ధరించే బట్టలతో పాటు ధరించే పాదరక్షలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొంతమంది స్టైలిష్ గా కనిపించడానికి వేసవి కాలంలో కూడా బూట్లు ధరించి తిరుగుతారు. అయితే కొన్నిసార్లు అరికలికి పట్టే చెమట వలన బూట్ల నుంచి దుర్వాసన వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కనుక వేసవి కాలంలో బూట్లు ధరిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? షూ ధరించేవారు తమ పాదాలను ఎలా సంరక్షించుకోవాలి? తెలుసుకుందాం..

Shoes in Summer: మీరు ప్యాషన్ ప్రియులా.. వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త సుమా..
Summer Tips

Updated on: Mar 29, 2025 | 10:49 AM

రంగురంగుల, ఆకర్షణీయమైన బూట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఈ బూట్లు ఆకర్షిస్తున్నాయి. ఈ బూట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది తమ దుస్తులకు సరిపోయేలా బూట్లు కొని ధరిస్తారు. అంతేకాదు వేసవిలో కూడా కొంతమంది రోజంతా బూట్లు ధరించి తిరుగుతూ ఉంటారు. అయితే ఈ సీజన్‌లో బూట్లు ధరించడం ఎంతవరకు మంచిది? అనే విషయాన్నీ వేసవిలో బూట్లు ధరించే వారు తప్పని సరిగా తెలుసుకోవాలి.

వేసవిలో బూట్లు ధరించే వారు తీసుకోవలసిన చర్యలు

  1. వేసవిలో.. వీలైనంత వరకూ పాదాలను గాలి ఆరనివ్వండి. చాలా మంది రోజంతా బూట్లు ధరిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బూట్లు విడిచి సాక్స్‌లను ధరించి నడుస్తారు. అయితే ఇలా చేయవద్దు. ఎందుకంటే ఎండ, వేడి కారణంగా పాదాలకు విపరీతంగా చెమట పడుతుంది. కనుక గాలికి పాదాలను ఆరనివ్వండి.
  2. బూట్లు బిగుతుగా ఉండటం వల్ల పాదాలకు చెమట పడుతుంది. అప్పుడు పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. ఈ సీజన్‌లో వీలైనంత వరకు తోలు బూట్లను దరించవద్దు.
  3. వేసవిలో బిగుతుగా లేని బూట్లను లేదా పాదరక్షలను కొనండి. అంటే కొంచెం వదులుగా ఉన్న బూట్లను ఖరీదు చేయాలి. ఎక్కువ బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు , పాదాలలో నొప్పి వస్తుంది.
  4. రోజంతా పాదాలకు బూట్లను ధరించడం వలన గాలి తగలదు. దీంతో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక ఇలాంటి సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందువల్ల పాదాలకు గాలి తగిలే.. తేలికైన పాదరక్షలను ధరించడం ఉత్తమం.
  5. ఇవి కూడా చదవండి
  6. వేసవిలో కూడా బూట్లను ధరించడం తప్పని సరి అయితే .. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. బూట్లు, సాక్స్‌లను సరిగ్గా శుభ్రం చేయకపోతే పాదాలకు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  7. వేసవిలో బరువైన బూట్లు ధరించవద్దు. దీనివల్ల పాదాలు ఎక్కువగా చెమట పడతాయి. ఎల్లప్పుడూ బూట్లను ధరించాలంటే క్లాత్ చేసిన బూట్లు , కాటన్ సాక్స్ ధరించండి. ఈ సీజన్ లో వీలైనంత వరకు నైలాన్ లేదా పాలిస్టర్‌తో చేసిన సాక్స్‌లకు దూరంగా ఉండండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)