Summer Health Tips: ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత వీటిని తింటున్నారా.. ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది..

|

May 17, 2024 | 6:54 PM

ఐస్ క్రీమ్ ఎక్కువ సమయం మంచులా  స్తంభింపజేయబడుతుంది. కనుక అధిక ఉష్ణోగ్రత కారణంగా.. ఐస్ క్రీమ్ తింటే నోరు కొంత సమయం చల్లగా ఉంటుంది. అయితే శరీరం మాత్రం చల్లబడదు. అయినా సరే చాలా మంది వేసవి కాలంలో రోజూ వివిధ రకాల ఐస్ క్రీమ్స్ తింటూనే ఉంటారు. అయితే ఇలా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటే ఆరోగ్యానికి హాని కలిగవచ్చు. ఈ రోజు ఆరోగ్య నిపుణుల చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.. 

Summer Health Tips: ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత వీటిని తింటున్నారా.. ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది..
Ice Cream
Follow us on

మండే ఎండలు, వడగాల్పులు ఉండే ఈ సీజన్‌లో చాలా సార్లు గొంతు పొడిగా మారడం ప్రారంభమవుతుంది. ఎన్ని నీళ్లు తాగినా ఉపశమనం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది వేసవి నుంచి ఉపశమనం కోసం ఐస్ క్రీం తినడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో శరీరం చల్లగా ఉంటుందని, గొంతుకు ఉపశమనం కలుగుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దీంతో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రోజూ ఐస్‌క్రీం తినడానికి ఇష్టపడతారు.

ఐస్ క్రీమ్ ఎక్కువ సమయం మంచులా  స్తంభింపజేయబడుతుంది. కనుక అధిక ఉష్ణోగ్రత కారణంగా.. ఐస్ క్రీమ్ తింటే నోరు కొంత సమయం చల్లగా ఉంటుంది. అయితే శరీరం మాత్రం చల్లబడదు. అయినా సరే చాలా మంది వేసవి కాలంలో రోజూ వివిధ రకాల ఐస్ క్రీమ్స్ తింటూనే ఉంటారు. అయితే ఇలా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటే ఆరోగ్యానికి హాని కలిగవచ్చు. ఈ రోజు ఆరోగ్య నిపుణుల చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం..

రోజూ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని ఢిల్లీలోని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాదు రోజూ ఐస్‌క్రీమ్ తినడం వల్ల అనేక రకాల  ఆరోగ్య సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

షుగర్ లెవెల్స్ పెరగడం

షుగర్‌ వ్యాధితో బాధపడేవారు రోజూ ఐస్‌క్రీమ్‌ తినకూడదు. ఎందుకంటే అందులో ఉండే షుగర్ వల్ల వారి బ్లడ్ షుగర్ లెవెల్ పెరగవచ్చు. అంతేకాదు ఐస్‌క్రీమ్‌ తయారీకి కృత్రిమ రంగులు ఉపయోగిస్తారు. కనుక రోజూ ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

దంత సమస్యలు

రాత్రి ఐస్‌క్రీమ్‌ తిన్న తర్వాత నిద్రపోతే.. అందులో ఉన్న చక్కెర రాత్రంతా నోటిలో ఉంటుంది. ఇది దంతాల్లో కుహరం ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక ఎవరికైనా ఎప్పుడైనా రాత్రి సమయంలో ఐస్‌క్రీమ్‌ తినాలని అనిపిస్తే.. తిన్న తర్వాత వెంటనే పళ్ళు తోముకోవాలి. ఇలా చేయడం వలన దంతాల నుంచి షుగర్ తొలగిపోతుంది.

వేడి వేడి పదార్థాలు

ఐస్‌క్రీమ్‌ తిన్న తర్వాత టీ, కాఫీ, సూప్ వంటి వేడి వేడి పదార్థాలు తాగకూడదు. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పులు రావొచ్చు.  దీని కారణంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యలు,  కడుపు నొప్పి బారిన పడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..