Eye Care Tips: బీ కేర్‌ఫుల్.. ఇవి తింటే కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉంది..

|

Apr 11, 2023 | 10:44 AM

ప్రతి వ్యక్తి ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు యుక్త వయసులోనే వృద్ధాప్యఛాయలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం.. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఒక వ్యక్తి ఆహారం, జీవనశైలి బాగుంటే.. దాని ప్రత్యక్ష ప్రభావం వారి ముఖం, శరీరంపై కనిపిస్తుంది.

Eye Care Tips: బీ కేర్‌ఫుల్.. ఇవి తింటే కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉంది..
Wrinkles
Follow us on

ప్రతి వ్యక్తి ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు యుక్త వయసులోనే వృద్ధాప్యఛాయలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం.. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఒక వ్యక్తి ఆహారం, జీవనశైలి బాగుంటే.. దాని ప్రత్యక్ష ప్రభావం వారి ముఖం, శరీరంపై కనిపిస్తుంది. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు, డైటీషియన్లు చెబుతుంటారు. చిన్న వయసులోనే ముడతల సమస్య రావడం టెన్షన్‌కు గురి చేస్తుంటుంది. మరి ఈ ముడతల సమస్యకు కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

షుగర్ వాడకం తగ్గించాలి..

చక్కెరతో చేసిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఇది చర్మం, జుట్టు రెండింటికీ ప్రమాదకరం. తీపి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు వేగంగా వచ్చేస్తాయి. దీని ప్రభావం ముఖంపై స్పష్టం ఉంటుంది.

అధిక నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఆహారాలు..

భారతదేశంలో చాలా మంది ప్రజలు నూనె, ఫ్రై చేసిన ఆహారాలను తింటారు. మార్కెట్‌లో చాలామంది ఈ ఫ్రై ఆహారాల కోసం కల్తీ, అనారోగ్యకరమైన నూనెను ఉపయోగిస్తారు. దీంతోపాటు.. పదే పదే నూనెను వేడి చేయడం, ఉపయోగించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు రావడమే కాకుండా, ముఖంలో వయసు తేడా కనిపిస్తుంది. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పకోడాలు, డీప్ ఫ్రైడ్ చికెన్ వంటి ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వీటి వల్ల ముడతలు, మొటిమల సమస్య తలెత్తుతుంది.

ఇవి కూడా చదవండి

మద్యం, సిగరెట్లు..

మద్యం, సిగరెట్లు ఆరోగ్యానికి హానీ తలపెడతాయి. ఈ రెండింటినీ అధికంగా తీసుకోవడం వల్ల చర్మం పాడైంపోతుంది. ముడతలు పడిపోతుంది.

కూల్ డ్రింక్స్..

వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. ఈ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. కూల్ డ్రింక్స్‌కి బదులుగా, చెరుకు రసం, తాజా పండ్ల రసం, లస్సీ, వెజిటబుల్ జ్యూస్ వంటి సహజ డ్రింక్స్ తాగితే చర్మం మెరుస్తుంటుంది.

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలు నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..