ఎండలు మండుతున్నాయి.. ఆర్థరైటిస్ రోగులకు సమస్యలు పెరుగుతాయా.. ? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Apr 24, 2024 | 4:13 PM

ఆర్థరైటిస్ నొప్పి రెండు ఎముకలు (జాయింట్) ఒకదానికొకటి కలిసే ప్రదేశంలో వస్తుంది. మోకాళ్లు, మోచేతులు, భుజాలు వంటివి ప్రాంతాల్లో ఆర్థరైటిస్ కారణంగా తీవ్ర నొప్పితో ఇబ్బంది పడతారు. అయితే ఎక్కువ సమస్య మోకాళ్లలో మాత్రమే కలుగుతుంది. ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సర్వసాధారణం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు వృద్ధులలో కీళ్లనొప్పులు ఎక్కువగా ఉండేవి..  ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా రావడం మొదలైంది.

ఎండలు మండుతున్నాయి.. ఆర్థరైటిస్ రోగులకు సమస్యలు పెరుగుతాయా.. ? నిపుణులు ఏమంటున్నారంటే..
Arthritis Patients
Follow us on

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. చర్మ సమస్యలు, కంటి సమస్యలు సాధారణంగా ఎక్కువమందిని ఇబ్బంది పెట్టేవే. అయితే పెరుగుతున్న వేడి ఆర్థరైటిస్ రోగులకు కూడా ప్రమాదకరమా? ఎండ వేడి వడగాల్పులు  ఆర్థరైటిస్ రోగుల సమస్యలను పెంచుతుందా? దీని గురించి నిపుణుల ఏమని చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.. ఆర్థరైటిస్ కారణంగా రోగికి కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూనే ఉంటారని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి చాలా తీవ్రంగా మారుతుంది. ఒకొక్కసారి రోగి ఆ బాధను భరించలేడు.

ఆర్థరైటిస్ నొప్పి రెండు ఎముకలు (జాయింట్) ఒకదానికొకటి కలిసే ప్రదేశంలో వస్తుంది. మోకాళ్లు, మోచేతులు, భుజాలు వంటివి ప్రాంతాల్లో ఆర్థరైటిస్ కారణంగా తీవ్ర నొప్పితో ఇబ్బంది పడతారు. అయితే ఎక్కువ సమస్య మోకాళ్లలో మాత్రమే కలుగుతుంది. ఆర్థరైటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సర్వసాధారణం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు వృద్ధులలో కీళ్లనొప్పులు ఎక్కువగా ఉండేవి..  ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా రావడం మొదలైంది.

విపరీతమైన వేడి ఎలాంటి ప్రభావం చూపుతుందంటే

మాక్స్ హాస్పిటల్ వైశాలిలోని ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ విభాగంలోని అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. వేసవి కాలంలో కీళ్లనొప్పులు రోగులకు ఎలాంటి ప్రత్యేక సమస్య ఎదురుకాదని.. అయితే ఆకస్మిక వేడి, చలి వల్ల హాని కలుగుతుందని డాక్టర్ అఖిలేష్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు ఆర్థరైటిస్ పేషెంట్ వేడి ఎండ నుంచి ఇంటిలోపలకు వచ్చిన వెంటనే ఏసీలో కూర్చుంటే, అతను సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇలా ఏసీలో కూర్చోవడం వల్ల కీళ్లనొప్పులు పెరిగే ప్రమాదం ఉందని, ఆర్థరైటిస్ సమస్య తీవ్రంగా ఉన్నవారు శరీరాన్ని బాగా కప్పుకుని ఏసీలో కూర్చోవాలన్నారు. ఈ సీజన్‌లో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటే రోగి వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.

పెరుగుతున్న ఆర్థరైటిస్‌ రోగుల సంఖ్య

గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఆర్థరైటిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం  భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 నుండి 15 శాతం మంది ఈ సమస్యకు చికిత్స కోసం వైద్యుల వద్దకు వెళ్తున్నారు. గత రెండు దశాబ్దాలలో ఆర్థరైటిస్ రోగుల సంఖ్య 12 శాతం పెరిగింది. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, చెడు భంగిమలు కూడా ఈ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాలు.

ఎలా రక్షించుకోవాలనుకుంటే

డాక్టర్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఎవరైనా ఒకసారి కీళ్ల నొప్పుల బారిన పడితే నివారణే మార్గం. దీనికోసం  యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు. అనేక రకాల చికిత్సలను చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే, రోగి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే.. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు బాగుంటే అటువంటి రోగికి పెద్దగా ఇబ్బంది ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..