Summer Health Tips: పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యకరమైనవే.. వేసవిలో ఏది బెస్ట్ అంటే..
వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకీ భానుగు భగభగలాడుతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో శరీరాన్ని చల్లబరిచి, ఎండ నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడే వాటి కోసం మనం వెతుకుతాము. ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగ రెండూ తీసుకుంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.

వేసవి కాలం వచ్చేసింది. దీంతో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో శరీరాన్ని చల్లబరచడమే కాదు శరీరాన్ని లోపలి నుంచి పోషణ అందించే ఆహారాల కోసం మనం వెతుకుతాము. పెరుగు, మజ్జిగ రెండూ వేసవికి సూపర్ ఫుడ్స్. ఈ రెండూ వేసవిలో చాలా ఆరోగాన్ని ఇచ్చే పదార్దాలే. ఈ రెండూ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో.. వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే కొంతమంది పెరుగు, మజ్జిగ ఒకటే అని అనుకుంటారు. అయితే ఇది వాస్తవం కాదు. పెరుగు, మజ్జిగ మధ్య చాలా తేడాలు ఉన్నాయి,. ఈ రోజు పెరుగు, మజ్జిగ మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాం..
పెరుగు-మజ్జిగ మధ్య తేడా ఏమిటంటే
పెరుగు, మజ్జిగ రెండూ పాలతో తయారు చేసే పాల ఉత్పత్తులు, అయితే ఈ రెండింటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. పెరుగు అనేది పాలుని తోడు పెట్టడం ద్వారా తయారు చేయబడిన గట్టి పదార్ధం. పెరుగు పోషకాలు అధికంగా ఉండే పాల ఉత్పత్తి. ఇందులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్ బి12 , ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
పెరుగును చిలకరించడం ద్వారా మజ్జిగ తయారు అవుతుంది. దీనిలో అదనపు వెన్న తొలగించబడుతుంది. మజ్జిగలో ఎక్కువగా నీరు , తక్కువ కొవ్వు ఉంటుంది. ఇది తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
వేసవిలో పెరుగు-మజ్జిగ ఏది మంచిది?
శరీరాన్ని చల్లబరచడంలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది?
మజ్జిగ తేలికగా ఉండటంతో పాటు.. ఎక్కువ మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పెరుగు చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అయితే ఇది బరువుగా ఉంటుంది. అయితే దీనిని ఎక్కువగా తింటే శరీరంలో వేడిని పెంచుతుంది. కనుక వేసవిలో మజ్జిగ మంచి ఎంపిక.
జీర్ణక్రియకు ఏది మంచిది?
మజ్జిగ తేలికగా ఉంటుంది. కనుక ఇది సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్ణం మరియు ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు మందంగా .. భారీగా ఉంటుంది, ఇది కొంతమందికి అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల మజ్జిగ జీర్ణక్రియకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
మజ్జిగలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగులో అధిక కేలరీలు, కొవ్వు ఉంటాయి. కనుక పెరుగుని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. అందువల్ల బరువు తగ్గడానికి మజ్జిగ మంచిది.
నిర్జలీకరణాన్ని తొలగించడానికి ఏది సరైనది?
మజ్జిగలో ఎక్కువ నీరు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరం నిర్జలీకరణానికి గురికాకుండా నిరోధిస్తాయి. పెరుగులో నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. కనుక పెరుగు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచదు. అటువంటి పరిస్థితిలో వేసవిలో నిర్జలీకరణాన్ని తొలగించడంలో మజ్జిగ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)