summer fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలు ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయంటే..

వేసవి ఉష్ణోగ్రత, హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమం కోసం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కనుక రోజు తినే ఆహారంలో అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను చేర్చుకోవాలి. ఇవి దాహం తీర్చడంతో పాటు, చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడానికి అద్భుతమైన ఎంపిక. అయితే వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలను కూడా ఎక్కువ మంది తింటారు. అయితే వీటిల్లో ఏది బెస్ట్ ఎంపిక తెలుసుకుందాం.. 

summer fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలు ఏది మంచిది? ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయంటే..
Watermelon Vs Muskmelon
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:46 PM

వేసవి కాలం వస్తే చాలు దాహార్తిని తీర్చడానికి పండ్లు, డ్రింక్స్, జ్యుస్ వంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. పండ్లు, నీటి కూరగాయలు వేసవిలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. వేసవి ఉష్ణోగ్రత, హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమం కోసం, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కనుక రోజు తినే ఆహారంలో అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను చేర్చుకోవాలి. ఇవి దాహం తీర్చడంతో పాటు, చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడానికి అద్భుతమైన ఎంపిక. అయితే వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలను కూడా ఎక్కువ మంది తింటారు. అయితే వీటిల్లో ఏది బెస్ట్ ఎంపిక తెలుసుకుందాం..

పుచ్చకాయ:

వేసవిలో దాహార్తిని తీర్చడానికి పుచ్చకాయను తరచుగా తీసుకోవాలి. ఇందులో 90% కంటే ఎక్కువ నీటి శాతం  కలిగి ఉంటుంది. ఈ పండు హైడ్రేషన్ పవర్‌హౌస్‌ అనడంలో ఆశ్చర్యం లేదు. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటి శాతంతో పాటు, విటమిన్ ఎ, సిలకు మంచి మూలం.

కర్బూజ :

వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో ఒకటి మస్క్‌మిలన్. దీనిని కర్బూజా అని అంటారు. ఇది తీపి వాసనతో ఆరెంజ్ రంగుతో అందంగా కనిపిస్తుంది. పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. దీనిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని బీటాకెరోటిన్ క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

వేసవిలో పుచ్చకాయ, కర్బూజ హైడ్రేటింగ్ ఏది అంటే

పుచ్చకాయ వర్సెస్ కర్భుజ ఏది బెస్ట్ అంటే.. ఆర్ద్రీకరణ విషయానికి వస్తే రెండిట్లో స్పష్టమైన విజేత లేరు. రెండు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరానికి తేమను రిఫ్రెష్‌గా అందిస్తాయి. అయితే పుచ్చకాయలో నీటి శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కర్బూజ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. మొత్తానికి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో రెండూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వేసవి నెలల్లో ఇవి ఉత్తమ ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు
కేసీఆర్‌ చెప్తున్న థర్డ్‌ఫ్రంట్‌ లాజిక్‌ ఏంటి..?
కేసీఆర్‌ చెప్తున్న థర్డ్‌ఫ్రంట్‌ లాజిక్‌ ఏంటి..?
విడాకుల ఆహ్వానం.. అత్తారింటికి వీడ్కోలు..! భారీ హంగామాతో ..
విడాకుల ఆహ్వానం.. అత్తారింటికి వీడ్కోలు..! భారీ హంగామాతో ..