KCR: కేసీఆర్‌ చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమికి ఈసారి నంబర్‌ తగ్గుతుందా..? బీజేపీ, కాంగ్రెస్‌ లేని కూటమి సాధ్యమేనా?

గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తాజాగా కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్తరాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందనీ, ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్‌ తీసుకుంటున్నవేళ, తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్‌.

KCR: కేసీఆర్‌ చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమికి ఈసారి నంబర్‌ తగ్గుతుందా..? బీజేపీ, కాంగ్రెస్‌ లేని కూటమి సాధ్యమేనా?
Kcr
Follow us

|

Updated on: May 01, 2024 | 10:48 AM

గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తాజాగా కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్తరాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందనీ, ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్‌ తీసుకుంటున్నవేళ, తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్‌. తాజాగా ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్‌ ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది అసంభవమేమీ కాదన్నారు కేసీఆర్‌. మరోవైపు థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషిస్తాననీ, కూటమి ఏర్పాటు కోసం సారధ్యం వహించడానికి ప్రయత్నిస్తానని కేసీఆర్‌ చెప్పారు. కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు ఎందుకు అవకాశాలు ఉన్నాయో కూడా చెప్పారు కేసీఆర్‌. ఎన్డీయే కూటమి ఈసారి 200 సీట్ల వరకే సాధించగలదని ఆయన జోస్యం చెప్పారు. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందన్నారు. అయితే తాను ఏం చేయబోయేది ఇప్పుడే చెప్పలేనని కేసీఆర్‌ వివరించారు.

బీఆర్‌ఎస్‌ తిరిగి పుంజుకోవాలంటే ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తూ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్న కేసీఆర్.. ఢిల్లీ రాజకీయాలపై కొత్త లెక్క చెప్తున్నారు. కేసీఆర్ అయితే సంకీర్ణాన్ని బలంగా నమ్ముతున్నారు. మొదటి రెండు విడతల పోలింగ్‌ సరళిని బట్టి, ఈ అంచనాకు వచ్చినట్టు చెప్తున్నారు. ఎన్డీఏకి 200 దాటవని, అదే టైమ్‌లో ఇండియా కూటమి ప్రభావమూ లేదని అంటున్నారు. దీన్ని బట్టి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కీలకం అవుతాయని కేసీఆర్ చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ లేని కూటమి సరైన సంఖ్యాబలంతో అధికారంలోకి వస్తుందనే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందంటన్నారు. అంతేకాదు, ఈ మధ్య సంకీర్ణం మాట చెప్తున్న కేసీఆర్.. అన్నీ కుదిరితే నామా నాగేశ్వర్రావు కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఖమ్మం ఎంపీగా నామా గెలిస్తే ఢిల్లీలో పెద్ద పదవిలో ఉంటారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు