విరిగిన ఎముకలకు ఈ బెరడు తో చెక్..!!

Jyothi Gadda

30 April 2024

ప్రకృతిలో లభించే అర్జున వృక్షం కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ అర్జున వృక్షం మన దేశంలో విరివిగా పెరుగుతుంది. ఈ అర్జున వృక్షాన్ని తెల్లమద్ది అని కూడా పిలుస్తారు. అయితే ఎక్కువగా కలపగా ఉపయోగించే ఈ వృక్షాన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతారు. 

తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. ఈ చెట్టు లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రకాల మందుల తయారీలో దీనిని వాడతారు. ఆస్తమా గుండె జబ్బులను ఇది తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఈ బెరడుతో ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు అనేక రకాల ఆయుర్వేద మందులు అలాగే, మెడిసన్ తయారీకి కూడా ఈ బెరడు ఆకులు వాడతారు.

ఈ చెట్టు బెరడు లో క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. అర్జున చెట్టు బెరడుని పాలల్లో వేసుకుని కాచి తాగితే గుండె జబ్బులను నయం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 

ఈ చెట్టు బెరడు ను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ని పాలలో కలిపి తీసుకుంటే ఆస్తమా ను తగ్గిస్తుంది. ఈ చూర్ణం శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది. ఇంకా వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. పురుషుల్లో వీర్యం పెరగడానికి సహాయపడుతుంది. 

సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతుంది. ఈ చెట్టు బెరడు పొడి లో తేనె కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలను అతికిస్తుంది. ఈ మిశ్రమం ఎముకలను త్వరగా అతుక్కునేలా చేస్తుంది. మద్ది చెట్టు బెరడు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక సాంద్రత ను పెంచుతాయి.

ఈ చెట్టు బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి రాసుకుంటే దాంతో మొటిమలు త్వరగా తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది. ఈ బెరడు పొడిని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. 

అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అక్కడ ఈ బెరడు ను అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.