T20 World Cup: ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.. ఇది కదా కావాల్సింది.!

టీ20 ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తమ జట్లను ప్రకటించగా.. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును ప్రకటించింది.

T20 World Cup: ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.. ఇది కదా కావాల్సింది.!
Cricket Australia
Follow us

|

Updated on: May 01, 2024 | 11:19 AM

టీ20 ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తమ జట్లను ప్రకటించగా.. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును ప్రకటించింది. ఈసారి ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే..! 2014 తర్వాత నుంచి తొలిసారిగా స్టీవ్ స్మిత్ లేకుండా ప్రపంచకప్‌నకు వెళ్లబోతోంది ఆస్ట్రేలియా. అటు ఐపీఎల్‌లో దంచికొడుతోన్న యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ కూడా 15 మంది సభ్యుల్లో చోటు దక్కించుకోలేకపోయాడు.

2021లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లు.. మళ్లీ ఈ వరల్డ్‌కప్‌లోనూ చోటు దక్కించుకున్నారు. ఈ మెగా టోర్నీతో టీ20 ఫార్మాట్‌కి ఇకపై రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అని ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న డేవిడ్ వార్నర్‌కి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోగా.. యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌కు మొండిచెయ్యి చూపించారు సెలెక్టర్లు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తోన్న 22 ఏళ్ల మెక్‌గర్క్ ఐపీఎల్‌లో 233 స్ట్రైక్ రేట్‌తో 259 పరుగులు చేశాడు. అలాగే 23 ఫోర్లు, 23 సిక్సర్లు బాదేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ బార్బొడాస్‌లో ఒమాన్‌ జట్టుతో తలబడనుంది.

T20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మాథ్యూ వేడ్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, అష్టన్ అగర్, నాథన్ ఎల్లిస్.

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు