వేగంగా ఆహారాన్ని తినేస్తున్నారా! ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా 

30 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

కొందరికి చాలా హడావుడిగా తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వారికి మామూలుగా అనిపించవచ్చు. కానీ తొందరగా తినడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. 

త్వరగా తినే అలవాటు

ఎప్పుడైనా హడావిడిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే పదే పదే ఇలాగే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుంది.

ఆరోగ్యానికి హాని

హడావుడిగా తినే వారికి ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు అటువంటి వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఊబకాయం  

ఆహారం త్వరగా తినడం వల్ల బ్లడ్ షుగర్ కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇప్పటికే డయాబెటిక్ పేషెంట్ అయితే పొరపాటున కూడా తొందరపడి ఆహారం తీసుకోకండి.

మధుమేహం

అతివేగంగా తినడం వల్ల జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడతారు. అతేకాడు.. ఎక్కువగా కడుపునొప్పి. ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడతారు. 

అజీర్తి, కడుపునొప్పి సమస్య

తినే ఆహారం గబగబా గ్యాప్ లేకుండా తినేస్తే.. ఆ ఆహారం మీ గొంతులో చిక్కుకోవడం సహజం. దీనివల్ల ఒకొక్కసారి వాంతులు కూడా చేసుకోవచ్చు.

వాంతులు సమస్య

రోజూ హడావుడిగా ఆహారం తీసుకుంటే అంటే తినే తిండిలో రుచి చూడరు. ఆకలి కూడా తగ్గుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల తినే ఆహారం తగ్గుతుంది. 

ఆకలి తగ్గుతుంది

సరిగా నమలకుండా తింటే మెుత్తం ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, త్రేనుపు, మలబద్ధకం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 

నమలకుండా తింటే