Lifestyle: వేసవిలో షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?

|

Apr 22, 2024 | 10:02 AM

సమ్మర్‌లో షుగర్‌ లెవల్స్‌ పెరగానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ రోగులకు వేసవి కాలం అనేక సవాళ్లను తెస్తుంది. విపరీతమైన వేడి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: వేసవిలో షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?
తరచూ పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. రాత్రుళ్లు నిద్రలో దాహం వేయటం, పదే పదే లేవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఇది కూడా మధుమేహానికి సంకేతం. శరీరంపై గాయాలు త్వరగా మానవు. అతిగా ఆకలి వేస్తుంది. కాళ్లలో స్పర్శ తగ్గుతుంది. కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.
Follow us on

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది గంటలకే భానుడు భగభగమంటున్నాడు. ఇక సమ్మర్‌లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌, బీపీ ఎక్కువగా ఉన్న వారు సమ్మర్‌లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే సమ్మర్‌ షుగర్‌ పేషెంట్స్‌కు కూడా ఇబ్బందికరమేనని మీకు తెలుసా.? సమ్మర్‌లో శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

సమ్మర్‌లో షుగర్‌ లెవల్స్‌ పెరగానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ రోగులకు వేసవి కాలం అనేక సవాళ్లను తెస్తుంది. విపరీతమైన వేడి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహ బాధితులు సమ్మర్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. సమ్మర్ షుగ్‌ లెవల్స్‌ పెరగకుండా ఉండడానికి పాటించాల్సి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా సమ్మర్‌లో శరీరంలో త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి దాహం వేసినా వేయకపోయినా కచ్చితంగా తగినంత నీరు తాగాలాని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్రమంతప్పకుండా మజ్జిగను తీసుకోవాలి. అయితే పండ్ల రసాలు మంచివే అయినా కొన్ని సందర్భాల్లో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని మర్చిపోకూడదు.

* వీలైనంత వరకు నేరుగా ఎండకు తగలకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఉదయం 10లోపు, సాయంత్రం 5 తర్వాతే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్తే కచ్చితంగా గొడుగు ఉపయోగించాలి. అలాగే కాటన్‌ దుస్తులను తప్పకుండా ధరించాలి.

* వేసవిలో తీసుకునే ఆహారంలో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు తీసుకోవడం మంచిది.

* ఇక వేసవి కాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ చక్కెర స్థాయిని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ షుగర్‌ లెవల్స్‌లో అనుకోని మార్పులు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

* వేసవి కాలంలో కూడా తేలికపాటి వ్యాయామం తప్పనిసరి. ఉదయం మరియు సాయంత్రం నడక లేదా యోగా చేయడం ప్రయోజనకరం. అయితే హెవీ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది కాదు. దీనివల్ల డీహైడ్రేషన్‌ సమస్యల తలెత్తే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..