Cervical Vertigo: తల తిప్పేస్తోందా? నిలబడటం కూడా కష్టమవుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం..

| Edited By: Anil kumar poka

Jan 04, 2023 | 4:54 PM

తల తిరగడం, మైకం(dizziness)గా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం దీని ప్రధాన లక్షాణాలు. దీని ప్రభావం మొదట్లో కొద్దిగా ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Cervical Vertigo: తల తిప్పేస్తోందా? నిలబడటం కూడా కష్టమవుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం..
Vertigo
Follow us on

సర్వైకల్ వెర్టిగో.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది ఒక వ్యాధి. ఇది ప్రధానంగా జీవన శైలి కారణంగా వస్తుంది. తల తిరగడం, మైకం(dizziness)గా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం దీని ప్రధాన లక్షాణాలు. దీని ప్రభావం మొదట్లో కొద్దిగా ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సర్వైకల్ వెర్టిగో ఎలాంటి వారికి వస్తుంది? దాని లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలి? ఇంటి చిట్కాలు ఏమూనా ఉన్నాయా? వంటి అంశాలను తెలుసుకుందాం..

ఆ నొప్పి ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వండి..

మెడ నొప్పి, డ్రౌజీ ఫీలింగ్ నిరంతరం ఇబ్బంది పడుతుంటే, అది సర్వైకల్ వెర్టిగో కావొచ్చు. మీ జీవనశైలి ఈ వ్యాధికి కారణం కూడా అవొచ్చు. కంప్యూటర్ డెస్క్ వద్ద ఎక్కువ సేపు కూర్చొని ఒకే భంగిమలో పనిచేయడం వల్ల సర్వైకల్ వెర్టిగో వస్తుంది. మెడ సరైన పొజిషన్ లో లేకపోవడం, వెన్నుపాము గాయం కారణంగా, ప్రజలు తరచుగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మెడ నొప్పితో పాటు కళ్లు తిరగడం కూడా ఇబ్బంది పెడుతుంది. నిపుణు అభిప్రాయం ప్రకారం వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే, తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.

ఇవిగో ప్రధాన లక్షణాలు..

  • ఈ వ్యాధి కారణంగా, ఒక వ్యక్తి ఏకాగ్రత తగ్గుతుంది. మెడలో నొప్పి ఉంటుంది.
  • నిలబడి లేదా నేరుగా నడవడానికి ఇబ్బంది పడతారు. నడుస్తుంటే తల తిరగడం వల్ల పడిపోతానేమోనని భయం ఏర్పడుతుంది.
  • తలనొప్పి, వికారం, వాంతుల ఫీలింగ్ ఉంటుంది.
  • చెవినొప్పి లేదా చెవులలో రింగింగ్ అవుతుంటుంది.
  • నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం, వీక్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది.

ఇవి తింటే మంచిది..

  • ఈ వ్యాధి కారణంగా, మైకం, వికారం, భయం ఏర్పడతాయి. అలాంటప్పుడు కొంచెం కొత్తిమీర, ఉసిరికాయలను తీసుకోవాలి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే ఉసిరి, కొత్తిమీరను తీసుకుంటే శరీరంలోని బలహీనత తొలగిపోయి తలతిరగడం పోతుంది. మీరు కొత్తిమీర, ఉసిరికాయలను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉపయోగించవచ్చు. ఈ నీటిని ఉదయాన్నే వడపోస్తే సర్వైకల్ వెర్టిగో లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • మీకు కళ్లు తిరగడం వల్ల ఇబ్బందిగా ఉంటే చిన్న అల్లం ముక్కను నోటిలో పెట్టుకుని చప్పరించండి. అల్లం తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మెదడు సాంత్వన పొందుతుంది.
  • మీ తల తిరుగుతుంటే, మైకం, వికారం మిమ్మల్ని బాధపెడితే, పిప్పరమెంటు టీ మంచి కాస్త నెమ్మది నిస్తుంది. పుదీనా టీ వికారం తొలగిపోతుది.
  • మెడ నొప్పి నుంచి బయటపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మెడకు వ్యాయామం చేయడం వల్ల మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. డ్రౌజీ నెస్ కూడా దూరమవుతుంది.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..