మర మనిషి జీవితం..ఉరుకుల పరుగులతో ప్రతినిత్యం కాలంతో పరిగెడుతున్న మనిషి లైఫ్ స్టైల్ ప్రస్తుత కాలంలో పూర్తిగా మారిపోయింది. హుషారు తగ్గిపోతోంది.. అనేక ఒత్తిళ్లూ, విపరీతమైన టెన్షన్స్ తో ఏదో కొల్పోతున్న ఫీలింగ్ పెరుగుతోంది.. ఇది మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటూ.. మెదడు కుంచించుకుపోతూ.. చివరకు అల్జీమర్స్ కు దారి తీస్తోందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మధ్య వయస్కు మహిళల్లో మరీ ఎక్కువగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీలో వెల్లండిచిన పరిశోదన వివరాల ప్రకారం ..మగాళ్లతో పోలిస్తే.. మహిళల్లో మధ్య వయస్సు రాగానే స్ట్రెస్ హార్మోన్లు తీవ్రతను పెంచుతూ..మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయట. అందువల్ల మధ్య వయస్సు మహిళలకు ఎక్కువగా అల్జిమర్స్ వస్తోందని తెలిపింది.
అల్జిమర్స్ అసోసియేషన్ ప్రకారం ..60 ఏళ్లు దాటిన ప్రతీ ఆరుగురు మహిళల్లో ఒకరికి అల్జిమర్స్ ఉంటోంది. అదే మగాళ్ల విషయంలో అలా కాదు. ప్రతీ 11 మందిలో ఒకరికి అల్జిమర్స్ వస్తోంది. ఈ అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను అడ్డుకునే ట్రీట్ మెంట్ ప్రస్తుతం లేదట.
ఒత్తిడిని మనం జయించలేం.. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అటువంటివి. అయితే, స్ట్రెస్ ఉంది కదా అని దానికి లొంగిపోకూడదు. దాని అంతు చూడాలి. ధైర్యంగా పోరాడాలి. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్రయత్నించాలి. ఈ ఒత్తిళ్లు నన్ను ఏమీ చెయలేవ్..అని మనసులో బలంగా అనుకోవాలి. అలా మన మైండ్ ని మనమే స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలా చేసుకోవాలి అని సూచించారు అమెరికా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సింథియా మన్రో.
మన్రో టీమ్ దాదాపు 900 మంది డేటాను సేకరించి పరిశీలించింది. ఆ 900 మందిలో 63శాతం మంది మహిళలే ఉన్నారట. మొత్తం అందరి సగటు వయస్సు 47ఏళ్లేనట. మామూలు స్ట్రెస్ విషయంలో మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఒత్తిడి తగ్గిపోగానే ఆ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఐతే అదే పనిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటే.. హార్మోన్ల స్థాయి ఎక్కువైపోతుంది. పరిస్థితులు అదుపు తప్పుతాయి.
వీలైనంతవరకూ స్ట్రెస్ లేకుండా చేసుకోమంటున్నారు డాక్టర్లు. అయితే, యోగా లాంటివి చెయ్యాలనీ, ఇష్టమైన పాటలు వినాలనీ, బ్రెయిన్ బాగా పనిచేసే ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ లాంటి ఆహారం తినాలని సూచిస్తున్నారు.
మెదడు అనేక జ్ఞాపకాల కేంద్రం. మెదడు ద్వారా అందే సంకేతాలతోనే శరీరం చైతన్యంతో మనుగడ సాగిస్తుంది. వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ క్రమంలోనే మెదడు కూడా ఈ మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వలన జ్ఞాపకశక్తని పూర్తిగా కోల్పోవడాన్నే వైద్య పరిభాషలో అల్జీమర్స్ వ్యాధీ అంటారు. ఇది మెదడుకు, వాటిలోని నరాలకు సంబంధించిన సమస్య. దీని వల్ల మనిషి అలవాటుపడ్డ పనులలో చాలా తేడా కన్పిస్తుంది. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, మాట్లాడే విధానంలో మార్పును తీసుకువస్తుంది. వయసు పెరిగే కొద్దీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అనేక ఇబ్బందులకు ఇది దారితీస్తుంది.
సో..బీ కేర్ ఫుల్..వీలైనంత వరకు స్మార్ట్ వర్క్ చేస్తూ..స్ట్రెస్ లెస్ గా గడిపేయండి..