
కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. పొల్యూషన్, తప్పుడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి వల్ల వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది హెయిర్ స్పా ట్రీట్‌మెంట్లు, సెలూన్ థెరపీలు, ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయినా సరే ఆశించిన ఫలితం కనిపించక నిరాశకు గురవుతుంటారు. అయితే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలడాన్ని అడ్డుకుని, ఒత్తైన కురులను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పవర్‌ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఈ హోమ్ రెమెడీ కోసం వాడే ప్రతి పదార్థం జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఉసిరి పొడి: ఇందులో ఉండే విటమిన్-సి జుట్టు పెరగడానికి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.
భృంగరాజ్ పొడి: ఆయుర్వేదంలో భృంగరాజ్‌ను కేశరాజ అని పిలుస్తారు. ఇది జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను పెంచి, కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది.
పెరుగు: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తలలోని చుండ్రును నివారించి, స్కాల్ప్‌ను క్లీన్‌గా ఉంచుతుంది.
కొబ్బరి నూనె: జుట్టుకు కావలసిన పోషణను అందించి, మృదువుగా మారుస్తుంది.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఆయుర్వేద హోమ్ మేడ్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే.. కేవలం కొన్ని వారాల్లోనే జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, నల్లగా, సిల్కీగా మారడం మీరే గమనిస్తారు.
(గమనిక: ఈ కథనంలోని విషయాలు కేవలం అవగాహన, సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. జుట్టు రాలడానికి అంతర్గత ఆరోగ్య సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. కాబట్టి ఈ చిట్కాలను పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)