Dont Eat These Foods: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకూడదు.. వైద్యుల హెచ్చరిక.!

|

Jun 12, 2021 | 2:08 PM

చాలామంది రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకుంటుంటారు. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం, లేకపోతే ఆలస్యంగా పడుకోవడం వంటివి కొందరికి అలవాటు..

Dont Eat These Foods: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకూడదు.. వైద్యుల హెచ్చరిక.!
Follow us on

ఈ కాలంలో అబ్బాయిలందరూ కూడా సిక్స్ ప్యాక్ యాబ్స్‌ కోసం ట్రై చేస్తుండటం తెలిసిందే. అయితే ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు తదితర విషయాలు కారణంగా చాలామంది అబ్బాయిలకు పొట్ట రావడం సహజం అయిపోయింది. వాళ్ళు ఎన్ని వ్యాయామాలు చేసినా కూడా అది తగ్గట్లేదు. అసలే ఇప్పుడు లాక్‌డౌన్ అమలులో ఉండటం.. అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సమస్య మరింతగా పెరిగింది.

ఇదిలా ఉంటే చాలామంది రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకుంటుంటారు. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం, లేకపోతే ఆలస్యంగా పడుకోవడం వంటివి కొందరికి అలవాటు. అయితే ఇవి కూడా మానుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల బరువు పెరగడమే కాకుండా దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందంటున్నారు. అటు భోజనం చేశాక, రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహార పదార్ధాలను అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

నూడిల్స్, చాక్లెట్స్, ఫ్రైడ్ స్నాక్స్, సోడా లాంటి పదార్ధాలు రాత్రి నిద్రపోయే ముందు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇవి తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ఛాన్స్ కూడా తుందని హెచ్చరిస్తున్నారు. అటు భోజనం చేశాక ఈ పనులు అస్సలు చేయకూడదని వైద్య నిపుణులు తెలిపారు.

భోజనం తర్వాత ఇవి అస్సలు వద్దు..

  • పండ్లు అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కౌట్స్ చేయకూడదు
  • భోజనం తర్వాత స్నానం చేస్తే ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది
  • భోజనం చేయగానే నిద్రకు ఉపక్రమిస్తే గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..