AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైమ్ కలిసి వస్తదని ప్రెషర్ కుక్కర్‌ లో ఇవి అస్సలు వండకండి.. ఎందుకంటే..?

ప్రెషర్ కుక్కర్ సహాయంతో వంటలన్నీ త్వరగా అవుతాయి. అలసిపోయిన రోజుల్లో సమయాన్ని ఆదా చేయడానికి చాలా మంది దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ సౌకర్యం వల్ల కొన్ని పదార్థాలు తినడానికి సరైన రుచితో ఉండకపోవడమే కాకుండా.. శరీరానికి ఇబ్బందులు కలిగించేలా కూడా మారుతాయి. కొన్ని పదార్థాలను కుక్కర్‌లో వాడటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

టైమ్ కలిసి వస్తదని ప్రెషర్ కుక్కర్‌ లో ఇవి అస్సలు వండకండి.. ఎందుకంటే..?
Pressure Cooker Cooking
Prashanthi V
|

Updated on: May 07, 2025 | 1:39 PM

Share

ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చినా.. చాలా మంది ఇప్పటికీ బియ్యం వండడంలో ప్రెషర్ కుక్కర్‌ పైనే ఆధారపడుతున్నారు. కానీ బియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కుక్కర్‌ లో వేడి అధికంగా ఉండటంతో ఆ స్టార్చ్ హానికరమైన రూపానికి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా వండిన బియ్యం తినడం వల్ల చర్మ సమస్యలు, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం బియ్యమే కాదు.. బంగాళదుంపలు, పాస్తా, నూడుల్స్ వంటి పదార్థాల్లోనూ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కుక్కర్‌లో వండకూడదు. సాధారణ గిన్నెలో ఓపెన్‌గా వండడం ఆరోగ్యానికి మేలు.

మనకు కొన్ని కూరల్లో గ్రేవీకి పాలు లేదా పెరుగు వేసే అలవాటు ఉంది. అవి రుచి పెంచడంలో ఉపయోగపడతాయి. కానీ ఇవి ఎక్కువ వేడి తట్టుకోలేవు. కుక్కర్‌లో వేడి, ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో పాలు విరిగి పోతాయి. అదే విధంగా పెరుగు తాలూకు లక్షణాలు మారిపోతాయి. ఇది వంట రుచిని మార్చడంతో పాటు శరీరానికి కూడా మంచిది కాదు. పాలు లేదా పెరుగు కలిగిన కూరలు తయారు చేసేటప్పుడు సాధారణ మంటపై మెల్లగా ఉడికించడం మంచిది. ఎక్కువ వేడి లేదా కుక్కర్ ఒత్తిడి వల్ల ఇవి విరిగి పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో వంట రుచి బాగుండదు.. ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, బ్రొకోలి, వంకాయ వంటివి తక్కువ సమయంలోనే ఉడికిపోతాయి. అయినా కొంతమంది వీటినీ ప్రెషర్ కుక్కర్‌లో వండుతుంటారు. ఇలా చేయడం వల్ల పోషకాలు దెబ్బతిని ఈ కూరగాయలు తమ సహజమైన రంగు, వాసన, రుచి కోల్పోతాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే ఆరోగ్యకరమైన పదార్థాలు వేడి కారణంగా పూర్తిగా హరించిపోతాయి. కాబట్టి ఇలా త్వరగా ఉడికే పదార్థాలను కుక్కర్‌లో వేయడం మంచిది కాదు. వీటిని సాధారణ గిన్నెలో వండటం ఉత్తమం.

ఓవెన్ లేకపోయినా కొన్ని కుటుంబాల్లో కేక్స్, కుకీస్ వంటివి ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేస్తుంటారు. కానీ దీని వల్ల అవి కావలసినట్టు మెత్తగా రావు. కేక్ తినేటప్పుడు ఉండే సాఫ్ట్‌నెస్, వాసన కూడా ఉండదు. బేకింగ్ వంటకాలకు ప్రత్యేకంగా ఓవెన్ వాడితేనే మంచి ఫలితం వస్తుంది.

ప్రెషర్ కుక్కర్ వాడకం వల్ల సమయం, శ్రమ తక్కువగా ఖర్చవుతుంది. కానీ కొన్ని పదార్థాలను దాంట్లో వాడటం వల్ల రుచికీ, ఆరోగ్యానికీ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఏ పదార్థాన్ని ఎలా వాడాలో తెలిసినప్పుడే మంచి ఫలితం ఉంటుంది.