వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నేడు చాలా ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రజల రోజువారీ జీవితంలో ఏసీ ఒక భాగమైపోయింది. శరీరానికి చల్లదనాన్ని అందించినా.. ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం శరీరానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. AC గాలిని పీల్చడం వలన అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ముక్కు, గొంతు సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఏసీ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఎక్కువసేపు ఎయిర్ కండీషనర్‌లో కూర్చోవడం వల్ల ఒళ్లు నొప్పులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరికి కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు రావచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎక్కువ సేపు ఎయిర్ కండీషనర్‌లో కూర్చోవడం మానుకోవాలి. అదనంగా, ది కంఫర్ట్ అకాడమీ పరిశోధన ప్రకారం వెన్నునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారికి తరుచుగా ముక్కు కారుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
డీహైడ్రేషన్
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల తరచూ దాహం వేధించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. కాబట్టి తరచూ తలనొప్పితో బాధపడేవారు ఏసీకి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారు బలహీనంగా ఉంటారు. తరచుగా నీరసానికి గురవుతుంటారు.
చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది..
చర్మ సమస్యలు ఉన్నవారు ఏసీలో గడపడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే గాలిలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారవచ్చు. దీనితో పాటు చర్మంలో తేమ కోల్పోయే అవకాశం ఉంది. చర్మ సమస్యలతో బాధపడేవారు ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చర్మంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల త్వరగా ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు వచ్చిపడుతుంటాయి.
సోమరితనం..
ఎక్కువసేపు ఏసీ గాలికి గురికావడం వల్ల నిద్రలేమి వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పాటు బద్ధకం పెరుగుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువసేపు ఏసీలో కూర్చోకపోవడమే మంచిది. అందుకే రోజు మొత్తం మీద కేవలం 20 నుంచి 30 నిముషాల సమయం మాత్రమే ఏసీలో ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..