Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..? చెక్కలతో చేసిన వాషింగ్‌ మెషీన్‌ భలేగా పనిచేస్తుంది..! వైరల్ అవుతున్న వీడియో

తక్కువ ఖర్చుతో సులువుగా తయారు చేసుకునే సహజమైన వాషింగ్ మెషీన్ ఇది...! ఈ కారణంగా ఈ ఆలోచన మరింత ఎక్కువ మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి దేశీ జుగాడ్‌ వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో విస్తృతంగా కనిపిస్తుంటాయి.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీటిలో కొన్ని ఉపాయాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో..? చెక్కలతో చేసిన వాషింగ్‌ మెషీన్‌ భలేగా పనిచేస్తుంది..! వైరల్ అవుతున్న వీడియో
Outdoor Washing Machine
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 11, 2023 | 8:41 PM

ఇప్పుడు మార్కెట్లో వినూత్న రకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా అనేక రకాల వాషింగ్ మెషీన్లను చూసి ఉంటారు. కానీ, ఇది నిజంగానే వినూత్నమైన వాషింగ్ మిషన్..! ఇది జుగాడ్ వాషింగ్ మెషీన్. ఇది ఇంట్లో తయారుచేసిన వాషింగ్ మెషీన్. అవును ఇదేంటనీ ఆశ్చర్యపోకండి..! అంతేకాదు.. ఇది చెక్కలతో తయారు చేసిన బకెట్‌ వాషింగ్ మెషీన్‌..చెక్క బకెట్‌తో తయారు చేసిన వాషింగ్‌ ఎలా పనిచేస్తుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

మనకు జుగాడ్ ఆలోచనలకు లోటు లేదు. ఇలాంటి కొత్త ప్రయత్నాల దృశ్యాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ జుగాడ్‌ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  అయితే, ఈ లాండ్రీ టెక్నిక్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అంచనా వేయడం కష్టం. కానీ, ఈ భావన మాత్రం అందరికీ నచ్చుతుంది. తక్కువ ఖర్చుతో సులువుగా తయారు చేసుకునే సహజమైన వాషింగ్ మెషీన్ ఇది…! ఈ కారణంగా ఈ ఆలోచన మరింత ఎక్కువ మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి దేశీ జుగాడ్‌ వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో విస్తృతంగా కనిపిస్తుంటాయి.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీటిలో కొన్ని ఉపాయాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..

ఇవి కూడా చదవండి

వీడియో X ఖాతా @ValaAfsharలో షేర్‌ చేయబడింది. 9-సెకన్ల నిడివిగల ఈ క్లిప్‌.. ‘ఇది అందంగా డిజైన్ చేయబడిన అవుట్‌డోర్ వాషింగ్ మెషిన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది. పై నుండి నీరు బలంగా ప్రవహిస్తుండగా, మధ్యలో సరిగ్గా అమర్చిన చెక్క బకెట్‌ లాంటిది ఏర్పాటు చేశారు. ఈ బకెట్ లోపల బట్టలు వేశారు. నీరు వేగంగా ప్రవహించడంతో, బకెట్ లోపల బట్టలు కూడా తిరుగుతున్నాయి. అయితే, దీనిని ప్రయత్నించకుండా ఇది బట్టలు మెరుస్తుంది అని చెప్పలేము. కానీ ఈ ఆలోచన మాత్రం సూపర్‌ అని చెప్పొచ్చు.

సహజంగానే, ప్రజలు ఈ వీడియోపై ఆసక్తి చూపిస్తున్నారు. అందరూ ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఈ పోస్ట్‌కు చాలా వ్యూస్‌ వచ్చాయి. అలాగే చాలా మంది వీడియో రీపోస్ట్ చేశారు. ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ చాలా మంది స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బతికి ఉండగానే అంత్యక్రియలు చేసుకున్న 30 ఏళ్ల స్త్రీ.. ఎందుకంటే
బతికి ఉండగానే అంత్యక్రియలు చేసుకున్న 30 ఏళ్ల స్త్రీ.. ఎందుకంటే
Viral Video: నడిరోడ్డు మీద భర్తను చితక్కొట్టిన భార్య...
Viral Video: నడిరోడ్డు మీద భర్తను చితక్కొట్టిన భార్య...
అధికారికంగా NIA అదుపులో తహవూర్ హుస్సేన్ రాణా
అధికారికంగా NIA అదుపులో తహవూర్ హుస్సేన్ రాణా
భోజనం తిన్న వెంటనే మీరూ బాత్రూమ్‌కి వెళ్తున్నారా? ఇది ప్రమాదమా..
భోజనం తిన్న వెంటనే మీరూ బాత్రూమ్‌కి వెళ్తున్నారా? ఇది ప్రమాదమా..
ఆర్ధిక ఇబ్బందులా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
ఆర్ధిక ఇబ్బందులా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
ఊహాల్లో విహరిస్తున్న బ్యూటీ.. కిటికిదగ్గర కూర్చొని మరి!
ఊహాల్లో విహరిస్తున్న బ్యూటీ.. కిటికిదగ్గర కూర్చొని మరి!
గ్లామర్ లుక్‎లో మృణాల్ .. ఈ బ్యూటీ అందం చూస్తే మతిపోవాల్సిందే!
గ్లామర్ లుక్‎లో మృణాల్ .. ఈ బ్యూటీ అందం చూస్తే మతిపోవాల్సిందే!
లంచ్‌ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
లంచ్‌ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
భర్త దూరంగా ఉంటున్నాడని మామతో ఆ యవ్వారం..
భర్త దూరంగా ఉంటున్నాడని మామతో ఆ యవ్వారం..
ఫిల్ సాల్ట్ దెబ్బకు చెత్త రికార్డ్ నమోదు చేసిన మిచెల్ స్టార్క్!
ఫిల్ సాల్ట్ దెబ్బకు చెత్త రికార్డ్ నమోదు చేసిన మిచెల్ స్టార్క్!