Green tea: గ్రీన్‌ టీ తాగాలంటే చేదుగా అనిపిస్తుందా.. ఇలా ట్రై చేయండి.. గ్యారంటీ నచ్చుతుంది

|

Nov 19, 2022 | 9:48 PM

మిల్క్ టీతో పోలిస్తే.. ప్రస్తుతం అందరూ ఆరోగ్యం కోసం గ్రీన్ టీని తాగుతున్నారు. దీంతో గ్రీన్‌ టీకి ఇటీవల కాలంలో చాలా డిమాండ్ పెరిగింది. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికి తెలుసు. కానీ దాని రుచి చేదుగా ఉంటుంది. రుచి మార్చుకోవడం కోసం షుగర్ వేస్తే....

Green tea: గ్రీన్‌ టీ తాగాలంటే చేదుగా అనిపిస్తుందా.. ఇలా ట్రై చేయండి.. గ్యారంటీ నచ్చుతుంది
Rose Tea
Follow us on

మిల్క్ టీతో పోలిస్తే.. ప్రస్తుతం అందరూ ఆరోగ్యం కోసం గ్రీన్ టీని తాగుతున్నారు. దీంతో గ్రీన్‌ టీకి ఇటీవల కాలంలో చాలా డిమాండ్ పెరిగింది. గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికి తెలుసు. కానీ దాని రుచి చేదుగా ఉంటుంది. రుచి మార్చుకోవడం కోసం షుగర్ వేస్తే.. దానిలోని పోషకాలు పొందలేము. అయితే గ్రీన్ టీ మరింత టేస్టీగా, హెల్తీగా మార్చే చక్కని టీ ఉంది. అదే రోజ్ గ్రీన్ టీ. ప్రతి రోజూ లేవగానే టీ తాగిన తర్వాత తమ దినచర్యను ప్రారంభించడం అలవాటుగా ఉంటుంది. ఓ మంచి హెల్తీ, టేస్టీ టీ తాగాలనుకుంటారు. గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉన్నప్పటికి.. అందరికి అది నచ్చదు. అయితే గ్రీన్ టీ వలె ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మరొకటి ఉంది అదే రోజ్ గ్రీన్ టీ, రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ రోజ్ గ్రీన్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

గ్రీన్ టీ బ్యాగ్ – 1

రోజ్ వాటర్ – 1 టీస్పూన్

ఇవి కూడా చదవండి

నీళ్లు – 1 1/2 కప్పు

తేనె – 1 టీస్పూన్

ఎండిన గులాబీ రేకులు – 5

తయారీ విధానం

రోజ్ గ్రీన్ టీ తయారీ కోసం ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. దానిలో నీటిని వేసి మరిగించాలి. దానిలో ఎండిన గులాబీ రేకులను వేయాలి. గులాబీ రేకుల నుంచి సారాంశం విడుదలైన తర్వాత.. తేనె వేసి.. స్టవ్ ఆపేయాలి. ఆ నీటిని ఓ కప్పులో తీసుకుని.. దానిలో రోజ్ వాటర్, గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి. కాసేపు అలా ఉంచేసి.. గ్రీన్ టీ బ్యాగ్‌ని తీసివేయాలి. అంతే వేడి వేడి రోజ్ గ్రీన్ టీ రెడీ అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి