Health: చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా.. కంగారు పడాల్సిన పనేం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

|

Aug 23, 2022 | 7:43 AM

చేపలు (Fish) తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యం...

Health: చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా.. కంగారు పడాల్సిన పనేం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే సరి
Fish Thorn
Follow us on

చేపలు (Fish) తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. చేపల్లో ముళ్లు ఉంటాయి. కాబట్టి వీటిని తినేందుకు చాలామంది భయపడుతుంటారు. చేపలను తింటే ముళ్లు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయోనని వీటిని దూరం పెడుతుంటారు. అంతే కాకుండా చేపలు తినేటప్పుడు కొన్ని సార్లు వాటి ముళ్లు (Fish thorn) గొంతులో ఇరుక్కుంటాయి. అటువంటి సందర్భాల్లో భయపడకుండా వాటిని సులభంగా బయటకు తీయవచ్చు. చేపల ముళ్లు గొంతులో ఇరుక్కోకుండా నేరుగా జీర్ణాశయంలోకి వెళితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. జీర్ణాశయంలోని ఆమ్లాలు చేపల ముళ్లను సులభంగా కరిగించేస్తాయి. చేపల ముళ్లు గొంతులో ఇరుక్కుంటే పొట్టమీద గట్టిగా ఒత్తాలి. వీపుపై ఒత్తిడి కలిగించాలి. ఈ సమయంలో నోటిని తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముల్లు ఈజీగా బయటకు వస్తుంది. పొడి అన్నాన్ని ముద్దలా చేసి నమలకుండా మింగేయాలి. తరువాత గ్లాస్‌ మంచినీళ్లు తాగాలి. దీంతో ముల్లు గొంతు నుంచి లోపలికి జారిపోతుంది. అరటిపండును సగం తీసుకుని నోట్లో వేసుకుని నమలకుండానే మింగేయాలి. ఇలా చేసినా మంచి ఫలితమే ఉంటుంది.

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే బ్రెడ్‌ను తినాలి. బ్రెడ్ కు రెండు వైపులా పీనట్‌ బటర్‌ రాసి తినేయాలి. తర్వాత నీళ్లు తాగాలి. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల వెనిగర్‌ కలిపి ఆ నీటిని రెండు టీస్పూన్ల మోతాదులో తాగాలి. చేప ముల్లు ఇరుక్కుపోయిన వెంటనే సోడాను తాగినా మంచి ఫలతం ఉంటుంది. సోడాలో ఉండే గ్యాస్ గొంతులోని ముల్లుపై ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ముల్లు బయటకు వస్తుంది. చేప ముల్లు గొంతులో ఇరుక్కోగానే వెంట వెంట‌నే 4, 5 సార్లు ద‌గ్గాలి. దీంతో ముల్లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. అందుకే చేపలను తినేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా, కంగారు పడకుండా తినాలి. ఎంత ప్రయత్నించినా ముల్లు బయటకు రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం