Chana Dal: పచ్చి శనగ పప్పు తింటే షుగర్ మాయం.. ఇంకా ఎన్నో లాభాలు..

|

Oct 09, 2024 | 5:10 PM

నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే వాటిల్లో పచ్చి శనగ పప్పు కూడా ఒకటి. పచ్చి శనగ పప్పును తాళింపు పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. శనగపప్పులో కూడా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కనీసం వారంలో రెండు సార్లు అయినా పచ్చి శనగపప్పు తినాలి. దీన్ని కేవలం తాళింపులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పూర్వం పచ్చి శనగ పప్పును..

Chana Dal: పచ్చి శనగ పప్పు తింటే షుగర్ మాయం.. ఇంకా ఎన్నో లాభాలు..
Chana Dal
Follow us on

నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే వాటిల్లో పచ్చి శనగ పప్పు కూడా ఒకటి. పచ్చి శనగ పప్పును తాళింపు పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. శనగపప్పులో కూడా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కనీసం వారంలో రెండు సార్లు అయినా పచ్చి శనగపప్పు తినాలి. దీన్ని కేవలం తాళింపులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పూర్వం పచ్చి శనగ పప్పును నాన్ వెజ్, ఇతర వంటకాల్లో కూడా వేసి వండుతూ ఉండేవారు. ఈ శనగ పప్పు ఎంతో రుచిగా కూడా ఉంటుంది. శనగ పప్పు తింటే షుగర్, గుండె వ్యాధులను కంట్రోల్ చేయవచ్చు. రెగ్యులర్‌గా పచ్చి శనగ పప్పు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్ కంట్రోల్:

బరువు తగ్గాలి అనుకునేవారు పచ్చి శనగ పప్పును మీ డైట్‌లో చేర్చుకోండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి కొద్దిగా తినగానే పొట్ట నిండిపోతుంది. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోలేరు. అంతే కాకుండా కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇలా బరువు తగ్గొచ్చు.

షుగర్ కంట్రోల్:

పచ్చి శనగ పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు తరచూ శనగ పప్పుతో చేసిన వంటలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా గుండె:

శనగ పప్పు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గితే రక్త ప్రసరణ సజావు గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇతర గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఎముకలు బలంగా:

పచ్చి శనగ పప్పు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బల పరిచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

సవ్యంగా జీర్ణ క్రియ:

శనగ పప్పు తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరగు పడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు కంట్రోల్ అవుతాయి. పొట్ట ఆరోగ్యం పెరుగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..